కామన్ డైట్.. ఫోటోలకేనా?

by Ravi |   (  Updated:2026-03-01 00:45:30  IST  )

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు వర్ణనాతీతం.. పేద మధ్యతరగతి విద్యార్థులు పల్లె నుండే వసతి గృహాలకు వచ్చి గొప్పగా చదువుకొని ఏదో సాధించాలనుకుని వస్తే, ఇక్కడేమో పెక్కులూడిపడుతూ శిథిలావస్థకు చేరిన భవనాలలో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి.

కామన్ డైట్.. ఫోటోలకేనా?
X

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు వర్ణనాతీతం.. పేద మధ్యతరగతి విద్యార్థులు పల్లె నుండే వసతి గృహాలకు వచ్చి గొప్పగా చదువుకొని ఏదో సాధించాలనుకుని వస్తే, ఇక్కడేమో పెక్కులూడిపడుతూ శిథిలావస్థకు చేరిన భవనాలలో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి.. రాష్ట్రాన్ని సాధించి దాదాపు 12 సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా అద్దె భవనాలలోనే వసతి గృహాలను నడపడం ఆలోచించవలసిన విషయం. అద్దె భవనాలకు కిరాయి కట్టలేదని తాళాలు వేస్తే విద్యార్థులు రోడ్డుకు పడ్డ సందర్భాలు ఎన్నో.. ఇక వసతి గృహాలలో పూర్తిగా రక్షణ కరువైంది. పర్యవేక్షణ అసలే ఉండదు. వాచ్మెన్లు ఉండరు.. హాస్టల్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అడిగే వారే ఉండరు.. సరిపడా వాష్ రూమ్‌లు ఉండవు.. ఉన్నా వాటి నిర్వాహణ సరిగ్గా ఉండదు. ఇక సంవత్సరంలో నిర్వహించాల్సిన మెడికల్ క్యాంపుల ఊసే ఉండదు.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అనేది పూర్తిగా నిత్యకృతమైంది. 2025 ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల‌లో సుమారు 48 మంది ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్టు వెల్లడించడం జరిగింది. దాదాపు 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌ కారణంగా అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు.. 2024 డిసెంబర్ 14న ముఖ్యమంత్రితో పాటు కామన్ డైట్ మెనూ పేరిట గురుకులాలను వసతి గృహాలను సందర్శించి కామన్ డైట్ ఏర్పాటు చేస్తున్నామని హడావిడి చేసి విద్యార్థులతో భోజనం చేస్తూ ఫోటోలకు ఫోజు లిచ్చారు. కానీ వాళ్లందరూ వసతి గృహాలను విడిచి వెళ్లిన వెంబడే మళ్లీ పాత మెనూనే అమలు చేస్తున్నారు.. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థులపై చిన్నచూపు వీడి రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో అన్ని వసతి గృహాలలో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించి ఫుడ్ పాయిజన్ సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

-హరీష్ సాగర్

6302758830

Next Story