- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగాలపై ఎన్నో ఆశలతో టీచర్లు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసింది. అయితే గత ఏడాది డీఎస్సీ నిర్వహణ సమయంలోనే మరో 5 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ కేలండర్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.. కానీ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు వంటి సమస్యల వల్ల జాబ్ కేలండర్ వాయిదా పడిన విషయం తెలిసిందే.. గత డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ కాలంలో పదవి విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు, క్లియర్ వెకెన్సీ కలిపి దాదాపు రాష్ట్రంలో 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో టెట్ పరీక్షలు కూడా పూర్తి కాబోతుండటంతో.. ప్రభుత్వం త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన మోడల్ స్కూల్ ఖాళీల భర్తీ తర్వాత ఇంతవరకు మళ్లీ నోటిఫికేషన్ జారీ కాలేదు.. మోడల్ స్కూల్స్‌లో ప్రమోషన్స్ ప్రక్రియ, బదిలీల ప్రక్రియ త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మోడల్ స్కూల్స్‌లోనూ దాదాపు 2 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం డీఎస్సీతో పాటు మోడల్ స్కూల్స్ ఖాళీలకు నోటిఫికేషన్స్ ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతో పాటు, అటు ప్రభుత్వ పాఠశాలల మోడల్ స్కూల్స్ విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు.. కాబట్టి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..
-రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998






