దేశానికి హీరో.. ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం!

by Ravi |   (  Updated:2025-05-07 00:31:15  IST  )

జమ్మూకశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య.

దేశానికి హీరో.. ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం!
X

జమ్మూకశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. యావత్ భారతదేశ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది. పర్యాటకుల మతం అడుగుతూ ఐడీ కార్డులు చూస్తూ ఒక వర్గం వారిని చంపటం అత్యంత హేయమైన పిరికి మాలిన చర్య. ఈ దాడిలోనే స్థానిక గుర్రం స్వారీ ఆపరేటర్‌గా ఉన్న సయ్యద్ అదిల్ హుస్సేన్ ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో పారిపోవడానికి బదులుగా ఓ ఉగ్రవాది చేతిలోని తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించి తన ప్రాణాలనే బలిపెట్టి సహోదరత్వానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిపోయాడు.

జమ్మూకశ్మీర్‌లోని ప్రకృతి వనాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులను ముష్కరులు దాడి చేస్తుంటే కశ్మీరీ ముస్లింలు వారికి అండగా నిలబడి ధైర్యాన్ని నింపారు. ఉగ్రవాదుల దాడి నుంచి పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో 28 ఏళ్ల సయ్యద్‌ అదిల్‌ హుస్సేన్‌ షా తన ప్రాణాలనే అర్పించాడు. ఈ ఉగ్రవాదుల దాడిలో చంపబడిన ఏకైక స్థానిక వ్యక్తి ఆదిల్ షా.. భారతదేశ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకుంటున్న ఇలాంటి దుర్మార్గులకు తలవంచమని నిరూపిస్తూ ఆదిల్ షా ఆదర్శంగా నిలిచాడు. ఈయన మృతితో అతడి కుటుంబం రోడ్డున పడింది. ఆదిల్ షాకు వృద్ధ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. ఆదిల్ షా ఆ కుటుంబానికి ఏకైక జీవనాధారం. కొడుకును కోల్పోయినందుకు తల్లి దండ్రులు విలపిస్తున్నారు. అందుకే తమకు న్యాయం చేయమంటూ ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ప్రాణాలను కాపాడుకునే సమయంలో కూడా ఇతరులని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఆదిల్ హుస్సేన్ షా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

-అజీజుద్దీన్

70131 76656

Next Story