- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వక్ఫ్ చట్టంపై సుప్రీం తీర్పు భేష్!
చాలా కాలంగా వక్ఫ్ అన్నది ముస్లిం సమాజ సంక్షేమానికి ఉద్దేశించి, ఆ మతాన్ని ఆచరిస్తున్న దాతలు ఆస్తుల్ని, భూముల్ని

చాలా కాలంగా వక్ఫ్ అన్నది ముస్లిం సమాజ సంక్షేమానికి ఉద్దేశించి, ఆ మతాన్ని ఆచరిస్తున్న దాతలు ఆస్తుల్ని, భూముల్ని స్వచ్ఛందంగా అందిస్తున్న దాతృత్వ విధానం. దే శంలో ఇవి లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఆ ఆస్తులు, భూ ముల్లో కొన్నింటిపై ప్రభుత్వ భూముల ఆక్రమణ వివాదాలున్నాయి. వాటిపై హక్కుకై ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. పాత వక్ఫ్ చ ట్టంలో కొన్ని లోపాల వల్ల ఆస్తులు, వివాదాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వ వాదన.. అందుకనే పార్లమెంట్ చట్టం చేసిం ది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్త ర్వులు వెలువరించింది. ఆ చట్టాన్ని అమలు చేయకుండా స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తూ, కొన్ని అభ్యంతరకర నిబంధనల్ని కొట్టివేస్తే చాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులపై అధికార, ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేయడం, తమ తమ అభిప్రాయాలను గౌరవించినట్లు భావించడం విశేషం. ఈ మధ్య కాలంలో ఇలా వైరి పక్షాలు రెండూ సంతృప్తి వ్యక్తం చేసిన ఆదేశాలు ఇవే కావొచ్చు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, సక్రమ వినియోగం కోసం ఉద్దేశించిన ఈ చట్టం కూడా రాజ్యాంగ పరిధికి లోబడి ఉన్న కారణంగా కొట్టివేయ దగ్గది కాదన్నది కోర్టు ఉద్దేశ్యం. కాబట్టి స్టే విధించలేదు.. అదే సమయంలో కొన్ని నిబంధనలు నిర్హేతుకంగా ఉన్నాయి. చట్టం ప్రకారం ఐదేళ్ల నుండి ముస్లిం ఆచారాలు ఖచ్చితంగా పాటించే వారు మాత్రమే దాతలుగా అర్హులని ఉంది. అయితే అది నిర్ధారించే ప్రక్రియ ప్రస్తుతం ఏదీ లేదు కాబట్టి ఆ నిబంధనని అమలు చెయ్యకూడదని కోర్టు చెప్పింది. అలాగే ఏదైనా భూమిపై ప్రభుత్వంతో వివాదం ఉంటే, మొదట దాన్ని కలెక్టర్, వక్ఫ్ నుండి మినహాయించి స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధనను కూడా కోర్టు కొట్టి వేసింది. చట్ట ప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియ, విచారణ లేకుండా అలా తీసుకోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి కోర్టు దానిని కొట్టేసింది. అలాగే వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్‌లో ఉండదగ్గ ముస్లిమేతరుల సంఖ్యపై కోర్టు పరిమితి విధించింది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ రకంగా చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టకపోవడాన్ని అధికార పక్షం స్వాగతిస్తే, వివాదాస్పద నిబంధనల్ని తొలగించడం ప్రతిపక్షాలకు ఊరటనిచ్చింది. ఈ ఉదంతం చట్టాలపై పార్లమెంట్‌లో జరగాల్సిన లోతైన చర్చల అవసరాన్ని తెలియజేస్తుంది.
-డా.డి.వి.జి. శంకరరావు
94408 36931






