- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనివాళ్లకు ‘సుప్రీం’ అండ!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంటి పని వాళ్లు ఎలాంటి చట్టాల అమ లుకూ నోచుకోలేదు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంటి పని వాళ్లు ఎలాంటి చట్టాల అమ లుకూ నోచుకోలేదు. కనీస వేతనాల చట్టం, పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం. సమాన పనికి సమానవేతనం చట్టాలు ఉన్నప్పటికీ ప్రభు త్వాల కార్మిక వ్యతిరేక విధానాలలో భాగంగా దేశంలోని కోట్లాది మంది ఇంటి పనివాళ్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన మహిళా కార్మికులతో పాటు బాలిక, బాల కార్మికులు కూడా లెక్కకు మించిన గంటలు పనిచేస్తూ వివక్షకు, దౌర్జన్యాలకు, అత్యాచారాలకు గురవుతూ విపక్షకు గురికావడం జరుగుతుంది. ఇంటి పని వాళ్లకు సమగ్ర సంక్షేమ చట్టం రూపొందించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ ఎంప్లాయిమెంట్ అనుబంధంగా ఉన్న అధికారులతో కమిటీ వెంటనే వేసి 6 వారాల లోపు ఇంటి పనివాళ్ల పనికి, రక్షణ, చట్టాలు అమలు కోసం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టీస్ ఉజల్ భూయాన్, ఆదేశించారు. నిత్యం దోపిడీకి గురయ్యే ఇంటి పనివాళ్ల, కార్మిక కుటుంబాలలో ఈ ఆదేశం ఆశలు రేకెత్తించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తే వారి కుటుంబాలలో పనికి రక్షణ, పని భద్రత, కనీస వేతనం, గౌరవంతో పనిచేసే పరిస్థితులు సాధించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది.
ఇరికి మహేష్
98661 35431






