- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుద్ధిగా చదువుకో...
తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరానికి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు నగరానికి బాట పట్టారు...

తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరానికి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు నగరానికి బాట పట్టారు... అందులో ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లమా, బీటెక్, ఫార్మసీ, లా, మెడిసిన్ లాంటి అనేక రకాల విద్యను అభ్యసించడానికి, కోచింగ్‌లకు, విద్య, ఉపాధి మార్గాల కోసం తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థిని, విద్యార్థుల కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో బంధాలను విడిచి నగరాలకు బయలుదేరారు. అక్కడ విద్యార్థులు ఎలా ఉంటే విజయం వరిస్తుందో కింది మెలకువలను పాటించాలి. సరైన సమయాన్ని సరైన విధంగా ఉపయోగించినప్పుడు, కొత్త మిత్రులతో జాగ్రత్తగా ఉన్నప్పుడు, శత్రువులను పెంచుకోనప్పుడు, చెడు వ్యసనాలను దరిచేరనీయనప్పుడు, ప్రేమ, జూదం, గంజాయి, డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలను దగ్గరకు రానీయనప్పుడు, ఉదయం తొందరగా లేచినప్పుడు, రాత్రి తొందరగా పడుకున్నప్పుడు, చదువు చెప్పే సార్ల మాట సక్కగా విన్నప్పుడు, డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టినప్పుడు, బైక్‌పై స్పీడ్‌గా వెళ్ళనప్పుడు, విలువలతో నీతిగా ఉన్నప్పుడు, ఫోన్ తక్కువగా చూసి, పుస్తకాలు ఎక్కువసేపు చదివినపుడు, సోషల్ మీడియాలో తక్కువగా పాల్గొన్నప్పుడు , ఫోన్‌లో గేమ్స్, అనవసర ఆప్స్‌ను ఫాలో కానప్పుడు, అటెండెన్స్ రెగ్యులర్‌గా ఉన్నపుడు, తరగతిలో మొదల నుంచి ఎలాంటి బ్యాక్ లాగ్ సబ్జెక్టు లేనప్పుడు, టీచర్ చెప్పే సబ్జెక్ట్ పాఠాలు విన్నపుడు, ఎలాంటి ఆందోళన లేనపుడు, గ్రౌండ్‌లో గేమ్స్ ఆడినపుడు, చదువు.. చదువు అని తల్లితండ్రుల వత్తిడి లేనపుడు, సమయానికి తిండి, నిద్ర ఉన్నపుడు, విజయం వరిస్తుంది... విద్యార్థీ, బుద్ధిగా చదువుకో.. బుద్ధిమంతుడివికా..
ఏ.బాబు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఇంగ్లీష్)
సంస్కృతి ఇంజినీరింగ్ కాలేజీ, హైదరాబాద్
97013 06838






