- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా సమస్యలను పరిష్కరించండి!
రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వ స్వార్ధ, కక్షపూరిత నిర్ణయం వల్ల జీవో 81, 85 వల్ల 55 సం.రాల వయస్సు పైబడి 61 సం.రాల వయస్సు

రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వ స్వార్ధ, కక్షపూరిత నిర్ణయం వల్ల జీవో 81, 85 వల్ల 55 సం.రాల వయస్సు పైబడి 61 సం.రాల వయస్సులోపు ఉన్న పూర్వ వీఆర్ఏలకు చాలా అన్యాయం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తూ ఇతర శాఖలకు పంపించడంతో అతి తక్కువ సర్వీస్ ఉన్నవారు ఇబ్బందులకు గురయ్యారు. అటు వారి వారసులకు ఉద్యోగాలు రాక, ఇటు ఉన్న ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయంతో దాదాపు 2500 దళిత విఆర్ఏల కుటుం బాలు రోడ్డున పడ్డాయి. 61 సం.ల వయస్సు పైబడిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం సుమారు 200 మంది వీఆర్ఏలకు శాఖలు కేటాయించి ఆ శాఖలో ఖాళీలు లేక పది నెలలుగా పోస్టులు చూపించకుండా, జీతం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేసింది. కొంతమంది వీఆర్‌ఏలు ఇతర శాఖలో చేరిన రెండు, మూడు నెలలకు రిటైర్మెంట్ అయిన వారు ఉన్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందడంతో కొందరు నెల జీతం తీసుకోకుండానే, ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుం డా గడిచిన రెండు సంవత్సరాలలో దాదాపు 1200 మంది పూర్వ వీఆర్ఏలు రిటర్మెంట్ అయ్యా రు. ఇలా అన్యాయనికి గురై రిటర్మెంట్ అయిన పూర్వ వీఆర్ఏ లు మాకు న్యాయం చేయాలని హైకోర్టును కోరగా పెండింగ్‌లో ఉన్న 2 సం.రాల జీతాలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వనికి ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు జీతాలు చెల్లించలేదు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు పూర్వ వీఆ ర్ఏలు పడుతున్న కష్టాలను మానవీయ కోణంలో ఆలోచించి ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వయో భారంతో దూర ప్రయాణాలు చేస్తూ ఇతర శాఖల్లో పని చేయలేకపోతున్న వారిని వీఆర్ఏలుగా కొనసాగించాలి అని కోరుతున్నాం.
- రొండి తిరుపతి
95739 01621






