- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్.. సమీక్షా? ఓటర్ల తొలగింపా?
ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా రివ్యూ (SIR) ప్రక్రియపై దేశవ్యాప్తంగా సందేహాలు పెరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపులు, పారదర్శకత లోపం, ప్రజాస్వామ్య హక్కులపై ప్రభావం వంటి అంశాలపై విశ్లేషణ.

ఎన్నికల కమిషన్ మూడవ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర రివ్యూ 'సర్'ని 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలో మొదలు బెట్టబోతుంది. అందుకు తగ్గ సన్నాహకాలు చేసుకుంటోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొదటి రెండు దశల్లో దాదాపు 10 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగింపులు జరగ్గా, వాటిపై నెలకొన్న సందేహాలు, వివాదాలపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన దిద్దుబాట్లేవీ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఆ కమిషన్‌కి రాజ్యాంగ పరంగా ‘సర్’ నిర్వహించే హక్కు, భాద్యతలున్నట్లు ప్రకటించింది. దీంతో ఈసీ మూడోదశని రెట్టించిన ఉత్సా హంతో చేపట్టనుంది. అప్పుడు కేవలం హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్ మాత్రమే ఈ ప్రక్రియ జరగని ప్రాంతాలుగా మిగిలిపోతాయి. అయితే ఈ సర్ ప్రక్రియపై సందేహాలు సామాన్యుడి మదిలోంచి తొలగిం చే పనేదీ సదరు సంఘం చెయ్యడం లేదు. సర్ నిర్వహించడంపై ఆ కమిషన్‌కి ఉన్న ఆ హక్కూ, బాధ్యతలపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే దాన్ని హడావిడిగా ముగించే వ్యవహారంగా నిర్వహించడం, తొలగించిన ఓట్లపై పునః పరిశీలన కార్యక్రమం పక్కాగా, పీపుల్ ఫ్రెండ్లీగా లేకపోవడం, గంపగుత్త ఓట్ల తొలగింపులు, జనాభాకు అనుగుణంగా లేని ఆశ్చర్యకరమైన లింగ నిష్పత్తుల మార్పులు ఈ ప్రక్రియపై భయాల్ని పెంచుతున్నాయి. ఒక ఓటుతోనే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే ఎన్నికల విధానం అనుసరిస్తున్న దేశంలో కోట్లమంది, దాదాపు 10 శాతం మంది ఓట్లు తొలగింపు జరగడమన్నది రాజకీయ ముఖచిత్రాల్ని మార్చివేసే అంశం. అంతమంది అనర్హులు ఇంతవరకూ పాలనని శాసించారా, లేక ఇప్పుడు అంతస్థాయిలో అర్హులు తమ హక్కుకి దూరమయ్యారా? అన్నది చూడాలి. పోనీ అందులో 2 శాతం మంది అర్హులు ఓటు హక్కు కోల్పోయి ఉన్నా అది తీవ్రమైన విషయమే. కాబట్టి సర్ ప్రక్రియ స్పీ డ్‌గా జరగడం కన్నా, సురక్షితంగా జరగాల్సి ఉంది. అన ర్హుల సంగతి పక్కకు పెట్టినా, అర్హులై ఉండీ తొలగింపులకు గురయినవాళ్లపై రాజకీయ పక్షాలు, పౌరసమాజం అప్రమత్తతతో ఉండాలి. ఎన్నికల్లో చూపించే స్థాయిలో సర్ ప్రక్రియలో కూడా ప్రజా చైతన్యం కనబడాలి.
-డా.డి.వి.జి.శంకరరావు,
94408 36931






