- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి ఆరోపణలు ఉన్నా.. ఈ అధికారులను బదిలీ చేయరా?
తెలంగాణలో పాఠశాల విద్య నడి సముద్రంలో నావలా తయారయింది. రాష్ట్రంలోని కొందరి డీఈవోలపై ఎన్నో అవినీతి ఆరోపణలు

తెలంగాణలో పాఠశాల విద్య నడి సముద్రంలో నావలా తయారయింది. రాష్ట్రంలోని కొందరి డీఈవోలపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ బదిలీలు చేయకపోవడంతో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతున్నది. ఇక గత 15 సంవత్సరాలుగా డీఈఓ పోస్టుల భర్తీ జరగనందువల్ల కొందరు అవినీతిపరులు, అక్రమార్కులు తెలంగాణలో జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఆర్డర్లు పొంది సర్కారు పాఠశాలలకు ద్రోహం చేస్తూ సర్కారు ఉపాధ్యాయులను చిల్లర కారణాలతో సస్పెండ్ చేస్తూ కార్పొరేట్ కళాశాలలకు, ప్రైవేట్ కళాశాలలకు తొత్తులుగా మారుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను నాలుగు జిల్లా లకు మాత్రమే రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నా రు. మిగిలిన 29 జిల్లాలకు అదనపు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉండటం వల్ల రాష్ట్రంలోని పాఠశాల విద్య సమస్యల వలయంలో ఇరుక్కుంది. ఇటీవల ప్రభుత్వం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కెపాసిటీ బిల్డింగ్ అనే పోగ్రాంను చేపడితే 33 జిల్లాల్లోని ఏ జిల్లా విద్యాశాఖ అధికారీ ఉపాధ్యాయులకు మెలకువలు ఏమి నేర్పలేదని తెలిసింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు అందరినీ బదిలీ చేసి ప్రతి జిల్లాలో కొత్త రక్తాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఉల్లాసాన్ని నింపి పాఠశాలలు తెరిచేలోగా బడులను బతికించాలని కోరుతున్నాం. ఇప్పటికే అన్ని ఉపా ధ్యాయ సంఘాలు ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రిని, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాను, పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డిని కలిసి ఈ విషయమై నివేదించాం. పాఠశాల విద్యను బతికించడానికి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తక్షణమే తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాల్లో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారులను బదిలీ చేసి సమర్థులైన ఉత్సాహవంతులు, విద్యా ప్రమాణాలు కాపాడే వారిని, లంచాలకు దూరంగా ఉండేవారిని జిల్లా విద్యాశాఖ అధికారులుగా పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాం.
రావుల రాజేశం
98488 11424






