- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులు జేస్తూ పండగలు చేసుకోవాలా?
పండుగలు మన సంస్కృతి, ఆచార, సంప్రదాయాలకు నిలువుటద్దం. మన జీవన విధానంలో ఒక భాగం. పండుగలను

పండుగలు మన సంస్కృతి, ఆచార, సంప్రదాయాలకు నిలువుటద్దం. మన జీవన విధానంలో ఒక భాగం. పండుగలను జరుపుకోవడం వలన ఆనం దం, ఉత్సాహంతో పాటు సామాజిక, సాంఘిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేస్తాయి. పండుగలు జరపడం వలన భవిష్యత్ తరాలకు సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపద అందుతుంది. అలాగే సామూహికంగా జరుపుకునే పండుగలు, భోజనాలతో మతాల, కులాల మధ్యన అంతరాలు తగ్గుతాయి. అయితే ఒకప్పుడు పండు గలు ఆనందాన్ని మాత్రమే ఇచ్చేవి.. ఇప్పుడు పండు గలు అంటే అప్పులకు నిలయాలు.. ఒకప్పుడు తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలు పుట్టు కలు, పెళ్లిళ్లు, చావులు, గ్రామ దేవతలకు బోనాలు ఇవి జరుపుకునేవారు. కానీ ఇప్పుడు బర్త్‌డేలు, మ్యారేజ్‌డేలు వాటితో పాటు ఎండాకాలం వచ్చిం దంటే దుర్గమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, బీరప్ప, గంగమ్మ ఇతర కులదేవతలు, 'బొడ్రాయి' లాంటి పండుగలను ఊరు ఊరంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగలలో మద్యం, భోజనం ఖర్చు ఖర్చు మామూలుగా ఉండదు. ఎంత ఎక్కువగా మద్యానికి ఖర్చు పెడితే వారు అంత పెద్దగా పండుగ చేసినట్లు. ప్రస్తుతం ఒడి బియ్యం వండుకుంటే కూడా మద్యం తోనే పండుగ ప్రారంభమై, ముగుస్తుంది. మద్యం లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు.. ఉదాహరణకు.. గత మే నెలలో ఓ ఊరిలో బొడ్రాయి పండుగ చేస్తే సుమారుగా ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందంట. మరో ఊరిలో ఎల్లమ్మ పండుగ చేస్తే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందట. అలాగే ఓ ఊరిలో సుమారు 65 కురుమ కుటుంబాలు వారి కుల దైవం బీరప్ప పండుగ చేస్తే ఒక్క కుటుంబానికి 1 లక్షా 50 వేల రూపాయలు ఖర్చు వచ్చిందంట. గిట్ల అప్పుల మీద అప్పులు అయితే వ్యవసాయదారులు ఎట్లా బతికేది? తెలంగాణ వ్యాప్తంగా కొందరి సంతోషం కోసం పండుగల పేర్ల తో వారి వారి స్తోమతకు మించి ఖర్చు పెట్టడంతో అప్పుల బారిన పడి అప్పులు తీర్చే మార్గం లేక నానా అవస్థలు పడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. పండుగల పేర్లతో కొత్త పోకడలు పోతూ స్తోమతకు మించి అప్పులు చేసుకోవడం మంచిది కాదు. ఇది తెలుసుకొని మన పరిస్థితుల మేర మనం పండుగలు చేసుకుంటే మన కుటుంబానికి మంచిది.
పులి రాజు
99083 83567






