- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్క్రాప్ పాలసీ కఠినతరం చేయాలి!
మనం ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు రవాణా శాఖ 15 సంవత్సరాలకే అనుమతిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆ తర్వాత కూడా ఆ బండి తిరగాలంటే

మనం ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు రవాణా శాఖ 15 సంవత్సరాలకే అనుమతిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆ తర్వాత కూడా ఆ బండి తిరగాలంటే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలి. అయితే రవాణా శాఖ ఆ బండి ఫిట్‌గా ఉందా! లేదా? నిర్ధారించి అనుమతిస్తుంది. నిజానికి 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ తగ్గి ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం అధికంగా ఉంటుంది. వీటి నుండి పొగ అధికంగా వస్తూ పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు దాటిన బండ్లకు ఫిట్‌నెస్ పరీక్షలతో పాటు గ్రీన్ టాక్స్‌ను రవాణా శాఖ విధిస్తుంది. అయితే పేరుకు నిబంధనలు ఉన్నా ఇలాంటి వాహనాలను తనిఖీలు చేయడం లేదు. అవి రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వాహనాలు అన్నీ కలిపి అక్టోబర్ ఆఖరి నాటికి ఏకంగా 41.86లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలే ఏకంగా 31.36లక్షలు(75.38%) ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈమధ్య రవాణా శాఖ కొత్త "స్క్రాప్ పాలసీ"ని తీసుకువచ్చింది. కాలం చెల్లిన వాహనాన్ని ఇస్తే కొత్త బండి జీవిత పన్ను, త్రైమాసిక పన్నుపై నిర్ణీత శాతం మినహాయింపు ఇస్తామని పేర్కొంది. అయితే ఈ తుక్కు విధానం స్వచ్ఛందమేనట. ఇటీవల15 ఏళ్లు దాటిన వాహనాల్ని రోడ్లపై తిరగనీయకుండా ప్రత్యేక విధానం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ప్రభుత్వం గ్రీన్స్ టాక్స్‌ను పెంచడంతో పాటు పలు ఇతర ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం అభినందనీయం. మనిషి వస్తు వినిమయ ప్రపంచంలో జీవిస్తున్నప్పటి, వాటి జీవితకాల పరిమితి మేరకే వాడుకోవాలి. అంతకంటే ఎక్కువ కాలం వాడుకుంటే సభ్య సమాజానికి, పర్యావరణానికి పూడ్చలేని నష్టం చేసిన వారు అవుతారు. అందుకే ప్రజలు బాధ్యతగా ఉండి ప్రభుత్వాల సూచనలు తూ.చా తప్పకుండా పాటిస్తే సమాజ, పర్యావరణ హితాన్ని కోరుకున్న వారు అవుతారు.
- మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,
9573666650






