స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత?వారిపై గ్లోబల్స్ ప్రచారం నిజమేనా?

by Disha edit |
స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత?వారిపై గ్లోబల్స్ ప్రచారం నిజమేనా?
X

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్‌జీ 1925లో ప్రారంభించారు, సహజంగానే డాక్టర్‌జీ ఆజన్మ దేశభక్తుడు. స్వాతంత్ర్యం కోసం అనేక పద్ధతులలో పని చేశారు. వారి చేతిలో పురుడు పోసుకున్న సంస్థ దేశం హితం గురించి, స్వాతంత్ర్య పోరాటంలో ఎనలేని పాత్రను నిర్వర్తించింది. సంఘ స్వయం సేవకులు జాతి కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. 'మనం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం తప్పనిసరి. రోజూ ఒక గంట సేపు శాఖలో ఉండి మిగతా సమయమంతా ఉద్యమానికి కేటాయించండి' అన్నారు డాక్టర్‌జీ. స్వాతంత్ర్య పోరాట కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి ఇంకో రాజకీయ కేంద్రం ఉండకూడదని డాక్టర్‌జీ భావించారు.

ఆర్‌ఎస్‌ఎస్ బ్యానర్‌పై కాకుండా కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. ఒకటే వేదిక, ఒకటే జెండా, ఒకటే బ్యానర్, ఒకే కార్యక్రమం ఉండాలని చెప్పి వారు కూడా స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 'స్వాతంత్ర్య సాధనకు తమ సర్వస్వాన్నీ త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని' 1929 ఏప్రిల్ 27, 28 తేదీలలో వార్ధాలో జరిగిన శిబిరంలో స్వయం సేవకులకు ఉద్బోధించారు. 1929 మార్చ్‌లో సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో సంఘం పాలుపంచుకున్నది. ఉద్యమ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిజ్ఞ చివరలో 'దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం మనం పని చేయాలని' జోడించడం జరిగింది. అనేక మంది సంఘ స్వయం సేవకులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారనే విషయం కొద్దిమందికే తెలుసు. ఎందుకంటే, ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోదు. స్వయంసేవకులు సహజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్‌వారి లాఠీ దెబ్బలకు, తూటాలకు ఎదురొడ్డారు.

బాల్యం నుంచే

డాక్టర్‌జీ నీల్సిటీ హైస్కూల్‌లో చదువుకునేటపుడే విక్టోరియా రాణి 60 వసంతాల పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా వితరణ చేసిన మిఠాయిని తినకుండా విసిరేశారు. పాఠశాలలోనే వందేమాతర నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయస్సులోనే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులూదారు. కలకత్తాలో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు అనుశీలనా సమితితో కలిసి పని చేశారు. పాండురావ్ కాంఖజి అనే స్వదేశీ ఉద్యమకారుడు డాక్టర్‌జీ ఉపన్యాసాలను 'కేసరి' అనే పత్రికలో రాశారు. వైద్య విద్య పూర్తి చేసుకుని నాగపూర్ వచ్చిన తరువాత కూడా విప్లవకారులతో సంబంధాలను కొనసాగించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుక రావడానికి ప్రయత్నాలు చేశారు. స్నేహితులతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం హెడ్గేవార్‌జీ మీద కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష విధించింది.

6 ఏప్రిల్ 30న గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అటవీ సత్యాగ్రహంలోనూ పాల్గొని అంకోలాలో తొమ్మిది నెలలపాటు జైలుశిక్ష అనుభవించారు. పూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ 31 డిసెంబర్ 1929న తీర్మానం చేసింది. 26 జనవరి 1930 న దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని నిర్ణయించింది. డాక్టర్‌జీ అన్ని శాఖలలో స్వాతంత్ర్య సందేశాన్ని వినిపించాలని సూచించారు. 1932లో సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గొనకూడదని నిషేధం విధించారు. సంఘం మతతత్వ సంస్థ అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. 1934లో జరిగిన బడ్జెట్ సమావేశాలలో కౌన్సిల్ మెంబర్లు వీడీ కోల్టే, ఎంఎస్ రెహమాన్ ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్థిస్తూ మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని భోపాల్ సంస్థానానికి ప్రభుత్వం హెచ్చరికలు పంపించింది.

ఆర్‌ఎస్‌ఎస్, సీపీఐ ఒకే సంవత్సరంలో అంటే, 1925లో ఆవిర్భవించాయి. సీపీఐ బ్రిటిష్‌వారికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. నేతాజీని హిట్లర్ ఏజెంట్ అని దూషించింది. 1927లోనే నేతాజీకి, డాక్టర్‌జీకి పరిచయం ఉంది. సంఘాన్ని గూర్చి విని నేతాజీ ప్రభావితులయ్యారు. 'ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వ్యతిరేకి, స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతుంది. వారి వాలంటీర్‌లను, ఆర్మీ, నేవీ, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి విభాగాలలో ప్రవేశపెట్టింది. సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు' అంటూ సీఐడీ ప్రభుత్వానికి నివేదించింది. 1940న కసరత్తులు, యూనిఫాం, వ్యాయామాలను ప్రభుత్వం నిషేధించింది. వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌లు ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అరెస్టయ్యారు. 1942లో జరిగిన 'క్విట్ ఇండియా' ఉద్యమంలో చాలా మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. దాదానాయక్, రాందాస్ రాంపూర్ బ్రిటిష్‌వారి చేతిలో చనిపోయారు. 1947లో దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన చిట్ట చివరి శరణార్థి రక్షణ బాధ్యతను స్వయం సేవకులు తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. దేశం పట్ల స్వయం సేవకుల త్యాగనిరతి, అంకిత భావం అనిర్వచనీయమైనది. భారత్ మాతాకి జై.

త్రిలోక్

94907 91726


Next Story

Most Viewed