మరాఠాల ఐక్యతా ప్రతీక!

by Ravi |   (  Updated:2025-02-19 00:45:41  IST  )

శివాజీ’ ఈ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు. 17 సంవత్సరాల వయసులో యుద్ధ రంగంలో

మరాఠాల ఐక్యతా ప్రతీక!
X

శివాజీ’ ఈ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు. 17 సంవత్సరాల వయసులో యుద్ధ రంగంలో అడుగుపెట్టి స్వతంత్ర మరాఠా సామ్రాజ్య కోసం పాటు పడిన మహా నాయకుడు ఆయన. గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రాజు. మహా రాష్ట్ర ప్రజల్లో ఐక్యత, జాతీయత భావాన్ని కలగజేసి వారిని ఒక జాతిగా తీర్చిదిద్దిన ఘనత ఈయనదే. దేశంలో ముస్లిం దురాక్రమణ వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో మాత్రం అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు.

క్రీ.శ 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఉన్న జునార్‌లోని శివనీర్ కోటలో జిజియా బాయి, షహాజీ దంపతులకు శివాజీ జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకు లు మరణించారు. అయితే ఈసారి పుట్టే బిడ్డ బతికి ఉండాలంటూ జిజాబా యి ఇష్టంగా పూజించే దేవత శివయ్( పార్వతి) మొక్కుకుంది. అందుకే ఆ యనకు పార్వతి పేరు కలిసేలా శివాజీ అనే పేరు పెట్టారు. ఆమె శివాజీని గొప్ప వీరునిగా తీర్చిదిద్దినది. క్షత్రియ విద్య, గుర్రపు స్వారీ దాదాజీ కొండ దేవ్ శిక్షణ ఇచ్చారు. ఆయన వ్యక్తిత్వా న్ని మరాఠా భక్తి ఉద్యమకారుడు అయి న సంత్ తుకారం మహారాజ్, సమర్థ రామదాసు తీర్చిదిద్దారు. శివాజీని తన పొరుగున ఉన్న రాజులు రాజుగా గుర్తించలేదు. తన తల్లి కోరిక మేరకు క్రీ.శ 1674 జూన్ 6 తేదీన రాయ్ గఢ్‌లో ఛత్రపతిగా గంగాభట్టు పండి తుని ఆధ్వర్యంలో పట్టాభిషేకం చేసుకున్నాడు. మేవార్ రాజపుత్రుల సాంప్ర దాయం ప్రకారం పట్టాభిషేకం నిర్వహించారు. శివాజీ చత్రపతి, హైందవ ధర్మోద్ధారక అనే బిరుదులు ధరించా డు. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్యం అని పేరు పెట్టాడు. తన ఇష్ట దైవంగా భవాని మాతని పూజించేవారు. రాయ గడ్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. ఆయన తన పాలనను ధర్మశాస్త్రానుసారంగా కొనసాగిచారు. తనకు సహాయపడటానికి అష్ట ప్రధానులను నియమించాడు పీష్వా, అమా త్య, మంత్రి, సచివ, సుమంత్, సేనా పతి, న్యాయధీశ్ అనే అష్ట ప్రధానులను నియమించారు.

గొప్ప నాయకుడు

తుకారం, సమర్ధ రామదాస్ లాంటి మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుల రచన లు శివాజీని అమితమైన మాతృభక్తితో హిందూ మతాభిమానంతో ఉత్తేజపరిచాయి. ఫలితంగా అతను మహారాష్ట్రలంతా ఒక జాతిగా రూపొందించాల ని ముస్లింల పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలని భావించాడు. గ్రామ పంచాయతీలను భంగపరచకుండా తన పాలనను కొనసాగించా రు. ఈయనకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతి ఇచ్చేవారు కాదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని కఠి నంగా శిక్షించేవారు. స్త్రీలను తన మా తృమూర్తిగా గౌరవించేవారు.

శివాజీ గొప్ప నాయకుడు. యుద్ద తం త్రంలో గొప్ప ప్రతిభాశాలి. ఆయన గొప్పతనం, వ్యక్తిత్వం ఆచరాణాత్మక సామర్థ్యంలో కనిపిస్తుంది. మొగల్ సామ్రాజ్యంతో అతడు విరోచితమైన పోరాటం జరిపాడు. మహారాష్ట్రలలో ఐక్యత జాతీయత భావాన్ని కలగజేసి వారిని ఒక జాతిగా తీర్చదిద్దిన ఘనత శివాజీదే. ఈయన మహారాష్ట్ర వైభవానికి ప్రతీక. ఆయన మరాఠాలలో అం దించిన స్ఫూర్తి నేటికి కొనసాగుతోంది.

(నేడు ఛత్రపతి శివాజి జయంతి)

తాటే అమోల్

97019 49459

Next Story