బడిబాటలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి!

by Ravi |   (  Updated:2025-06-08 00:30:46  IST  )

విద్య, వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాదు. సమాజ అభి వృద్ధికి, దేశ భవిష్యత్తుకు కీలకమైన అంశం. దీనిని కేవలం ఉపాధ్యాయుల

బడిబాటలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి!
X

విద్య, వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాదు. సమాజ అభి వృద్ధికి, దేశ భవిష్యత్తుకు కీలకమైన అంశం. దీనిని కేవలం ఉపాధ్యాయుల భూజాలపైన పెట్టడం మంచి పద్దతి కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతి సంవత్సరం ‘బడి బాట’ కార్యక్రమం జరుపుతుంటుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొంటున్నారు. కానీ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వామ్యం అయితే బడి బాట కార్యక్రమం విజయవంతం అవుతుంది. నిజానికి బడిబాట అనేది ఒక ప్రద ర్శన కాదు, బడి పట్ల ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తీసుకురావ డంలో కీలకమైన ఒక చైతన్య కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు, ప్రజాప్రతినిధులు కూడా భాగ స్వామ్యం అయితే విద్యారంగానికి ఒక కొత్త దిశను తీసుకోని రాగలరు. సాధారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా ‘ఇంగ్లీష్ మీడియం స్కూల్’ అనే ఆకర్షణకు లోనవుతుంటారు. కానీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపా ధ్యాయుల గురించి, విద్యా ప్రమాణాల గురించి బడిబాట కార్యక్రమాల్లో పాల్గొని, తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడితే వారికి ప్రభుత్వ పాఠశాలల పట్ల గౌరవం కలుగుతుంది. వీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి జిల్లాకు ఒక మంత్రి‌ని ఇంచార్జీగా నియమించినట్టు బడిబాట కార్యక్రమానికి కూడా జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జీగా నియమిస్తే బడిబాట కార్య క్రమం విజయవంతం అయి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు వంటి స్థానిక ప్రజా ప్రతినిధులు బడి బాటలో చురుకుగా పాల్గొనడం వలన ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి మరింత చేరువవుతాయి. కావున ప్రతిష్టాత్మకమైన బడి బాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- పల్లె నాగరాజు,

85004 31793

Next Story