- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో ఈ సౌకర్యాలు కల్పించండి!
తిరుమలకు ప్రతి హిందువు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్తుంటారు. అయితే అలిపిరిలో భద్రతా కారణాలతో ప్రతి భక్తుడిని, వారి వెంట

తిరుమలకు ప్రతి హిందువు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్తుంటారు. అయితే అలిపిరిలో భద్రతా కారణాలతో ప్రతి భక్తుడిని, వారి వెంట ఉన్న సామాగ్రిని అక్కడి అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. ఇది అత్యంత అవసరం. కానీ వయోధికులు, స్త్రీలు, పిల్లలు తమ తమ సంచులను ఇతర సామాగ్రిని వాహనాల నుండి దించి పరిశీలన తర్వాత మరల వాహనంలో పెట్టుటకు అత్యంత ప్రయాసలకు లోను అవు తున్నారు. కాబట్టి అక్కడి అధికారులు సంచులు దించకుండానే ఆధునిక రక్షణ పరికరాలు వినియోగించి తనిఖీలు చేయాలి. అలాగే తిరుమలలో కేంద్ర రిసెప్షన్ కార్యాలయంలో గదులు పొందిన తర్వాత వాటి వద్దకు పోవడానికి అత్యంత వ్యయం వెచ్చించాల్సి వస్తుంది. మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ అన్న ప్రసాద కేంద్రం చేరుకొనడానికి, గోవిందుని దర్శనానికి వెళ్లే సమయంలో కంపార్ట్మెంట్లలో గంటల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తుంది. కానీ కంపార్ట్మెంట్లలో కుర్చీలు లేక వయోధికులు, స్త్రీలు, నేల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడవలసి వస్తున్నది. అలాగే ఇక్కడ అల్పాహారం, పాలు నిర్దిష్టంగా కాకుండా నిరంతరంగా సరఫరా చేయాలి. ఈ కంపార్ట్మెంట్ ప్రాంతాల్లో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ ఇంకా పరిశుభ్రంగా అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దవలసిన అవస రం ఉంది. ఇక ప్రధాన హుండీలో కానుకలు సమర్పించడం భక్తులకు అతిగా కష్టం అవుతోంది. ఈ ప్రాంతంలో ఊపిరి కూడా సల్పడం కష్టంగా ఉందంటే అతిశయోక్తి కాదేమో! అందుకే భక్తులు దేవాలయం లోపల ఇతర హుండీలో కానుకలు సమర్పించడానికి తెలుగుతో పాటు ఇతర భాషలలో బోర్డులతో పాటు మైకులలో విస్తృత స్థాయిలో ప్రకటనలు చేయాలి. క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో హుండీలో కానుకలు సమర్పించడానికి సమర్థవంతంగా నిర్వహించాలి. ఇక్కడకి గుంపులు గుంపులుగా వెళ్లనీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. విశ్వ వ్యాప్తంగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను కళ్యాణ మండపాలు ఇతర భవనాలకు నిధులు సమకూర్చున్న తిరుమలేశునికి తన దర్శనానికి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన సకల సౌకర్యాలు కల్పించాలి.
-దండంరాజు రాంచందర్ రావు,
98495 92958






