నరక కూపంగా వారపు సంతలు

by Ravi |
నరక కూపంగా వారపు సంతలు
X

తంలో రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎక్కువగా గిరిజనులు, ఆదివాసులు నివసించే అడవులకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో వారానికి ఒక సారి వారపు సంతలు జరిగేవి. ఆ సంతల్లో గిరిజనులు సేకరించిన ఆటవిక ఉత్పత్తులు ఇప్ప పూలు, తేనె, చింతపండు, రకరకాల పండ్లు సేకరించి అమ్మేవారు. ఈ సంతల్లో ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతుల్లో క్రయవిక్రయాలు జరిగేవి. గిరిజనులకు కావాల్సిన కిరాణా సరుకులు కొనుగోలు చేసుకొని మరల వారు నివసించే గూడెంలోకి వెళ్లేవారు. రాను రాను రవాణా సౌకర్యం అభివృద్ధి చెందిన ప్రతి మండల కేంద్రాల్లో, ఒక మోస్తరు పెద్ద పల్లెటూరులో కూడా సంతలు జరుగుతున్నాయి. ఈ వారపు సంతలు నగరాలకు విస్తరించాయి. ముఖ్యంగా నగర శివారులో విస్తరించిన కాలనీలలో వారపు సంతలు ఏర్పడుతున్నవి. కాలనీల్లో అంతంత మాత్రంగా ఉన్న ఇరుకు సందుల్లో జరుగుతున్న ఈ సంతల్లో కూరగాయలు, చేపలు, మాంసం, మిర్చి బండ్లు రోడ్లకు ఇరువైపుల, మురికి కాలువల ప్రక్కన తినుపదార్థాలు అమ్మడంతో ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. నగరాల్లో సాయంత్రం వేళల్లో పాఠశాలల నుంచి పిల్లలు, ఆఫీసుల నుంచి పెద్దలు ఇంటికి తిరిగి వచ్చే సమయాల్లో ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

సందిట్లో సడేమియా లాగా సాయంత్రం చీకట్లో గృహిణీలు సరుకులు నిమిత్తం వెళ్లే వారిపై కొంతమంది పోకిరీలు శరీరాల్ని తాకడంతో అవమానం భరించలేకపోతున్నారు. కొంతమంది వ్యాపారస్తులు శాఖ నిర్ణయించిన తూనికలు ఉపయోగించకుండా కేవలం రాళ్లను మూటగట్టి సరుకులను అమ్మడం, చీకట్లో ఎల్.ఈ.డి బల్బుల కాంతిలో ఆకర్షణీయంగా కూరగాయలు తాజాగా కనబడి ప్రజలు మోసపోతున్నారు. ఈ సంతలు ఉన్న చోట్ల మూత్ర శాలలు లేకపోవడంతో కాలనీలలో ఉన్న ఇంటి గోడల పక్కన చిరు వ్యాపారులు, ప్రజలు, పశువులు మూత్ర విసర్జన చేయడంతో ఇంటి యజమానులు గగ్గోలు పెట్టడం తరుచుగా జరుగుతోంది. సంత ముగిసిన తరువాత రోజు కాలనీలలో వ్యాపారులు వదిలిన కుళ్ళిన కూరగాయలు, పశువుల మల మూత్రాలతో భరించలేని కంపు వాసన ఉంటుంది. ప్రతి సంతలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది వ్యాపారుల వద్ద పన్ను వసూలు చేయడం జరుగుతుంది. కానీ వ్యాపారులు, ప్రజల అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ వారపు సంతలో కొన్ని గంటల వ్యవధిలో ఎక్కువ జనసాంద్రత పెరగడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడంతో అంటు రోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. కావున అధికారులు ఇరుకు సందుల్లో, మురికి కాలువల ప్రక్కన కాకుండా విశాల మైదాన, పరిశుభ్రమైన ప్రాంతాల్లో ఈ వారపు సంతలు నిర్వహణ కొరకు అనుమతులు ఇచ్చి కాపాడాలని అధికారులకు ప్రజలు విన్నవించుకుంటున్నారు.

ఆళవందార్ వేణు మాధవ్,

868605175

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

317 జీఓ బాధితులకు న్యాయం జరిగేనా?


Next Story