- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
వాల్మీకి రామాయణం రమణీయం
ఆ కావ్యం తరతరాలకు ఆదర్శనీయం
శ్రీ సీతారాముల కల్యాణం కమనీయం
చూసిన వారికి దాచుకున్నంత వైభోగం..!
మాట తప్పని మడమ తిప్పని రేడు
స్వయం వరానికి వెళ్లే శ్రీరాముడు
ధనుస్సును ఎత్తి... నారిని సారించి..
శివుని విల్లును విరిచేను అవలీలగా
జానకి వంక చూసేను.. అజేయుడిగా..!
రాజుల ఎడదలలో గుచ్చె ఈత ముల్లు
సీత హృదయంలో విరిసేను హరివిల్లు
శ్రీరాముడి మెడలో సీత వేసె విరిమాల
ధరణిజ మెడలోన దండవేసే శ్రీరాముడు
దివినుండి దేవతలు కురిపించే పూల వర్షం
అతిథులు ఆశీర్వదించిరి అద్వితీయంగా..!
శ్రీ సీతారాముల కల్యాణం జరిగే వేడుకగా
ముత్యాల తలంబ్రాలు చల్లిరి..
పౌరులు మురిపెంగా వడపప్పు తిని..
పానకం తాగిరి కడుపు నిండుగా...!
(శ్రీరామ నవమి సందర్భంగా)
జి.సూర్యనారాయణ,
62817 25659
- Tags
- Poem
Next Story






