- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఆ రోజు అమ్మ ముఖంపై
పెట్టిన చురక మాసిపోయింది.
కానీ నా మనసుపై
చిరస్థాయిగా నిలిచి పోయింది.
ఆ రోజు అమ్మ చేతిపై పెట్టిన చురక
మంటతో సమసి పోయింది.
దానికి నాన్న చేసిన సమర్ధింపు
నా జీవితంలో గుర్తుండి పోయింది.
అమ్మ నా అల్లరికి బెత్తం పట్టి దండించేది
నాన్న అమ్మని సమర్ధించారు.
తమ్ముడు పుట్టాక నా ఇంట్లో
నేను పరాయి అయ్యాను.
నా ఇంట్లో నా తమ్ముడు
మహారాజయ్యాడు.
ముందు నుంచీ మురిపెం లేని
నేను మరింత కృంగి పోయాను.
రోజురోజుక అత్యాచారం అతిగానే ఉండేది.
నాలో సున్నితమైన భావోద్వేగం పోయి
మూర్ఖత్వం చోటు చేసుకుంది.
నేను నా తల్లితండ్రులకు
ఇష్టంలేని భారాన్నని తెలుసుకున్నాను.
నా అవసరం వీళ్ళకు లేదన్న
భావన గుండెల్లో గుచ్చుకుంది.
నా చిన్ని హృదయం పట్టలేని
దు:ఖాన్ని మోయలేక పోయింది.
హృదయం ద్రవించేలా విలపించాను.
అమ్మా నాన్నలో ఎవరినీ ద్వేషించలేక
చివరికి చీమలు దూరని చిట్టడవికి
కాకులు చేరని కారడవికి
మనుషులు లేని మరో లోకానికి
పారిపోవాలని అనిపించింది
చివరికి అంతా శూన్యమే.
- సర్వమంగళ
89616 26848






