- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆగిపో రాత్రి
నిలబడి పో చంద్రుడా
ఈ ప్రేమ మైదానంలో
వెన్నెల స్నానం చేయాలి
ప్రేమ జ్వాలలు చల్లార నివ్వు...
కోరికల కోడె నాగులు
మొగలి పొద కోరుతున్నాయి
విరహాగ్ని నీటితో చల్లారదు
ప్రేమ ముడుల మురిపాలు
వెన్నెల చినుకుల్లో తడవాలి...
ఆనందం అనంతాలదాక సాగాలి
వేకువ ప్రేమ దుఃఖాన్ని
తెర తీయకముందే
అందాక ఆగిపో రాత్రి
జీవితానుభూతులు పూలపరిమళాలలో
తడిసి తూగి సాగి పోయే దాక
ఆగిపో ఆగిపో...
రేడియమ్
92915 27757
- Tags
- Poem
Next Story






