అసమానతల భారతమా…

by Ravi |   (  Updated:2024-08-15 00:16:06  IST  )

POEM

అసమానతల భారతమా…
X

పరితపిస్తోంది నాదేశం..పరిణామం కోసమని..

పాల కోసం పసిపిల్లలు ఏడుస్తున్న నాదేశంలో

సినిమా హీరోల పోస్టర్లకు

రాజకీయ నాయకుల చిత్రపటాలకు

పాలాభిషేకం చేస్తోంది నాదేశం…

నా దేశంలో..పార్టీల జెండాలు వేరైనా

వాటి ఎజెండా ఒక్కటే

ప్రజలను దోచుకోవడమే..వాటి ఎజెండా…

కార్మికుడి కష్టాన్ని దోచుకొనే కంపెనీలు…

కర్షకుడి కడుపుకొట్టే ప్రభుత్వాలు…

ప్రజా ధనాన్ని కలుగుల్లో ఎలుకల్లా

మేస్తున్న నాయకుల తీరు మారేదెప్పుడో…

నా దేశంలో..పాతిక సంవత్సరాల

వయసున్న యువత నిద్రపోతుంటే

పండు ముసలి నాయకులు

నా దేశాన్ని పాలిస్తుంటే…

ఈ యువతరం మేల్కొనేదెప్పుడో…

ప్రశ్నించేదెప్పుడో… పాలించేదెప్పుడో…

కోనేటి నరేష్,

84998 47863

Next Story