- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అడవి ఒక్కటి కాలిపోతే
చండ్రగాడ్పులు, కొలిమి సెగలు, అగ్నికీలలు
భూమి మీద బతుకునంత బుగ్గి చేస్తాయి !
నింగినుండి తొంగి చూసే
రంగురంగుల చుక్కలన్నీ
రాలి నెత్తురు కక్కుకుంటూ
పేలిపోతాయి !
పగళ్ళన్నీ మండిపోయి
రాత్రులన్నీ కాలిపోయి
మహాప్రళయం జగం నిండా
తాండవిస్తుంది !
అందుకే మేము సైతం
అడవి అగ్గిని ఆర్పి వచ్చాము !
మేము సైతం,విశ్వ శ్రేయకు
చెమట చుక్కలు ధారపోశాము!
మేము సైతం,
వన్యప్రాణుల ఆత్మ ఘోషకు
వెర్రిగొంతుకలిచ్చి మోగాము!
మేము సైతం, అడవి సిగలో
పూలై పరిమళించాము!
-(తిరుమల అడవి అంటుకున్నప్పుడు అటవీశాఖ సిబ్బందితోపాటు వెళ్లి మంటలను ఆపిన తిరుపతి ట్రెక్కింగ్ బృందం అనుభూతికి అక్షర రూపం.)
- రాఘవశర్మ
- Tags
- Poem
Next Story






