పీఎం కిసాన్ సాయాన్ని పెంచాలి!

by Ravi |   (  Updated:2025-07-23 00:31:01  IST  )

భారతదేశంలో వ్యవసాయ రంగం కోట్లాది మంది ప్రజలకి జీవనోపాధి కల్పించడంతో పాటు దేశ ఆర్థికా భివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది.

పీఎం కిసాన్ సాయాన్ని పెంచాలి!
X

భారతదేశంలో వ్యవసాయ రంగం కోట్లాది మంది ప్రజలకి జీవనోపాధి కల్పించడంతో పాటు దేశ ఆర్థికా భివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రభుత్వాలు రైతే రాజు అంటూ సంక్షేమ పథకాలెన్ని తెచ్చినా క్షేత్రస్థాయి అమలులో లోపాల వల్ల రైతులకు జరగాల్సిన న్యాయం జరగట్లేదన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం 2019 నుండి దేశంలో ఉన్న రైతులందరికీ భూ కమతం, విస్తీర్ణంతో సంబంధం లేకుండా, వ్యవసాయ అవసరాల నిమిత్తం ఏడాదికి 6000 రూపాయల్ని మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే ఈ సాయం 2019 జనవరి 31 వరకు భూమి పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులకు మాత్రమే ఈ సాయం అందుతోంది. 2019 నుండి ఇప్పటివరకు గత ఆరు ఏండ్లుగా వ్యవసాయ భూమి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన వారికి, వారసత్వంగా యాజమాన్య హక్కులు బదిలీ అయ్యి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన వారెవరికీ పీఎం కిసాన్ సాయం అందట్లేదు. ఇందుకై స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్ర దిస్తే పీఎం కిసాన్ సమ్మాన్ వెబ్ సైట్‌లో కటాఫ్ డేట్ 2019 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉందని చెప్తున్నారు. కటాఫ్ తేది తర్వాత భూమి యాజమాన్య హక్కులు బదిలీ అయిన వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీనికి అవకాశం ఇస్తారని ఆ మధ్య వార్తలు వచ్చినా అవకాశం మాత్రం దాల్చలేదు. రైతులకు ప్రస్తుతం ఏడాదికి 6000 రూపాయలు, అది మూడు విడతల్లో ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న మొత్తంతో రైతుల అవసరాలు ఎలా తీరుతాయో ఆలోచించాలి. అందుకే ఈ సాయాన్ని కనీసం ఏడాదికి 12,000 వరకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తు న్నారు. పెద్ద, పెద్ద కార్పొరేట్ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీలతో పోల్చితే రైతులకు చేసే సాయం చాలా స్వల్పంగా ఉంటుంది. దేశానికి అన్నం పెట్టే రైతులు చేసే వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తేనే దేశానికి శ్రేయోదాయకం.

-డా. మంద అశోక్ రెడ్డి

99590 46499

Next Story