- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్టిక్ రహితంగా జీవిద్దాం!
ప్లాస్టిక్ వినియోగం భూమిపై జీవరాశులకు ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ కాలుష్యం ప్రభావాలు, నియంత్రణ అవసరం, ప్రత్యామ్నాయాలపై అవగాహన చేసుకోండి.

ప్రకృతి ఒడిలో మనిషి సృష్టించిన ఒక భయంకరమైన రక్కసి 'ప్లాస్టిక్'. ఒకప్పుడు సౌకర్యం కోసం కనిపెట్టిన ఈ వస్తువు, ఇప్పుడు భూగోళం మీద ఉన్న సకల జీవరాశుల ఉనికికే ముప్పుగా మారింది. నేడు ప్లాస్టిక్‌ను నియంత్రించకపోతే, భవిష్యత్తులో జీవ వైవిధ్యం కేవలం పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్లాస్టిక్ అనేది త్వరగా భూమిలో కలిసిపోయే పదార్థం కాదు.. ఇది విచ్ఛిన్నం కావడానికి వందల సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల కలిగే నష్టాలు అపారం. అయితే ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమని తెలిసినా, ప్రజల్లో ఇంకా అజాగ్రత్త కనిపిస్తోంది. సులభం గా దొరికే కారణంగా అధిక వినియోగం, ‘నేను వాడే ఒక కవర్ వల్ల ఏం జరుగుతుందిలే’ అనే ఆలోచనే నేడు టన్నుల కొద్దీ వ్యర్థాలకు కారణం. ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధం గురించి చట్టాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకు రాకపోవడం వల్ల ఈ సమస్య మరింత జటిం అవుతోంది. ఇప్పటికైనా ప్లాస్టిక్ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలి. ప్లాస్టిక్ సంచులకు బదులు గా జనపనార, కాటన్ సంచులను వాడటం అలవాటు చేసుకోవాలి. స్టీలు బాటిళ్లు, గాజు పాత్రల వాడకాన్ని పెంచాలి. వాడకాన్ని తగ్గించడం, తిరిగి వాడటం, పునరుద్ధరించడం అనే సూత్రాలను పాటించాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే పరిశ్రమలపై కఠిన నిబంధనలు విధించాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వేసే వారికి భారీ జరిమానాలు విధించాలి. చిన్నతనం నుండే పాఠశాలల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను బోధించాలి. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, విషపూరితం కాని గాలిని, ప్లాస్టిక్ లేని భూమిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్లాస్టిక్ భూమిని మింగే యక ముందే, ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం.
-వై. సంజీవ కుమార్,
94936 13555






