- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెన్షనర్ల సంక్షేమం.. ప్రభుత్వ బాధ్యత!
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్లు ఎదుర్కొంటున్న డీఆర్ బకాయిలు, గ్రాట్యుటీ జాప్యం, కొత్త పీఆర్సీ అమలు, ఆరోగ్య భద్రత వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సిన 11 కీలక సంక్షేమ చర్యలు..

ప్రభుత్వ ఉద్యోగులు మూడు నుంచి నాలుగు దశాబ్దాలపాటు ప్రజాసేవకు అంకితమై పనిచేసి పదవీ విరమణ పొందుతారు. వారు పొందే పెన్షన్ ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు.. చేసిన సేవలకు ప్రతిఫలంగా చట్టబద్ధంగా పొందే హక్కు. అందువల్ల పదవీ విరమణ అనంతరం వారు గౌరవప్రదమైన, ఆర్థికంగా భద్రమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సంక్షేమ చర్యలను అమలు చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది పెన్షనర్లు పెండింగ్ డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) బకాయిలు, గ్రాట్యుటీ చెల్లింపుల జాప్యం, కొత్త పీఆర్సీ అమలులో ఆలస్యం, పరిమిత ఆరోగ్య భద్రత, వైద్య సౌకర్యాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చులు, వృద్ధాప్య అవస రాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే 11 కీలక చర్యలు చేపట్టాలి. అవి 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించడం, కొత్త పీఆర్సీని నియమించి పెన్షన్లను సవరించడం, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను ఆలస్యం లేకుండా అందించడం, పెన్షనర్లు, వారి కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య భద్రత కల్పించి, మరిన్ని నాణ్యమైన ఆసుపత్రులను ఆరోగ్య పథకంలో చేర్చడం, 70 ఏళ్ల వయస్సు నుంచి అదనపు పెన్షన్ అమలు చేయడం, పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 నుంచి 12 సంవత్సరాలకు తగ్గించడంతో పాటు పెన్షనర్ల సంఘాలకు విధాన రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించి, CFMS సేవలను మరింత పారదర్శకంగా మార్చాలి. అలాగే వృద్ధాప్య సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, మానసిక ఆరోగ్య సేవలు నిరంతరం నిర్వహించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్షనర్లకు ప్రత్యేక సేవలు, వేగవంతమైన సమస్యల పరిష్కారం, గౌరవప్రదమైన వ్యవహారాన్ని నిర్ధారించే సమగ్ర సంక్షేమ విధానాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్లు గౌరవప్రదమైన జీవితం గడపడం వారి హక్కు. కాబట్టి వారికి ఇవన్నీ అమలుపరిచి పెన్షనర్ల జీవితాల్లో భరోసా, భద్రత, గౌరవాన్ని కల్పించాలని విజ్ఞప్తి.
-టి. ఎం. బి. బుచ్చిరాజు
97034 25006






