- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన ఓటు.. మన గ్రామ భవిష్యత్తుకే!
తెలంగాణలో నేడు రెండో విడత పంచాయతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ అనే బాధ్యతను ఎవరు నిజంగా భుజాన వేసుకోగలరో ప్రజలు పరిశీలించాల్సిన సమయం ఇది. ఎన్నికల వేళ ప్రతివాడూ

తెలంగాణలో నేడు రెండో విడత పంచాయతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ అనే బాధ్యతను ఎవరు నిజంగా భుజాన వేసుకోగలరో ప్రజలు పరిశీలించాల్సిన సమయం ఇది. ఎన్నికల వేళ ప్రతివాడూ ‘మా కోసం పనిచేస్తా’ అని చెప్పడం సహజం. కానీ ప్రజలు ఈసారీ ఆ మాటలను నమ్మే ముందు పదిసార్లు ఆలోచించాలి. గ్రామానికి నీళ్లు వస్తాయా? పంచాయతీ రోడ్లు బాగవుతాయా? వీధి దీపాలు వెలుగుతాయా? చెత్త సమస్య తగ్గుతుందా? ఎవరు నిజంగా పల్లె సమస్యలు అర్థం చేసుకున్నారు? ఎవరు రైతు సమస్యలపై నిలబడ్డారు? ఎవరు పంచాయతీ నిధులను పారదర్శకంగా వినియోగిం చగలరు? ఓటు వేసే ముందు ఈ ప్రశ్నలకు సమాధానంగా చూపగలిగే అభ్యర్థికి ఓటు వేయాలి. అలాగే పాఠశాలలు, వ్యర్థ నిర్వహణ, పిల్లల భద్రత, తాగునీరు, పారిశుధ్యం వంటివి అత్యంత ప్రాధాన్యంగా చూడాలి. ఇక యువత ప్రజా స్వామ్యానికి కొత్త శ్వాస.. కాబట్టి యువకులు సర్పంచ్ ఎన్నికలను కేవలం రాజకీయంగా కాకుండా, గ్రామ అభివృద్ధి కోసం వేదికగా చూడాలి. నూతన ఆలోచనలు, సాంకేతికత, పారదర్శకత, గ్రామ డిజి టలైజేషన్ వీటిని ముందుకు తెచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి. మన ఊరికి మంచిని కోరే పౌరుడిగా ఓటు వేయటం కేవలం హక్కు కాదు, బాధ్యత కూడా. అభివృద్ధి చేస్తానన్న మాటలు చెప్పేవారిని కాదు.. అభివృద్ధి చేయగలవారిని ఎన్నుకోవాలి. సర్పంచ్ ఎన్ని కలు గ్రామాల భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఆ పునాది ఎంత బలంగా ఉండాలో నిర్ణయించేది మనమే.. ఈసారి ఓటు వేసేది వ్యక్తికి కాదు.. మన గ్రామ భవిష్యత్తుకే. ‘మన ఊరు ముందుకు వెళ్లాలి.. మంచి నేతను ఎన్నుకోవాలి!’ ఇదే పల్లె ప్రజల ఆలోచన కావాలి. అయితే గత సారి కన్నా ఈసారి గ్రామాల్లో ఒక మంచి మార్పు కనిపిస్తోంది. ప్రజలు పని చేసే వాడినే ఎన్నుకోవాలనే స్పష్టత పెరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి బల సూచిక.
-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,
90101 28884






