- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన బుర్రల్లో గుజ్జు సరిగ్గా లేదు.. మనకూ ట్రీట్‌మెంట్ అవసరమే!
నిజంగా నిన్నటి తుని అమ్మాయిని చాలా మంది బ్లేమ్ చేస్తున్న విధానం చూస్తుంటే మన బుర్రలు ఇంత గొప్పగా ఎదిగినప్పుడు ఇలాంటి ఘోరాలు ఎందుకు ఆగుతాయిలే అనిపించింది.

నిజంగా నిన్నటి తుని అమ్మాయిని చాలా మంది బ్లేమ్ చేస్తున్న విధానం చూస్తుంటే మన బుర్రలు ఇంత గొప్పగా ఎదిగినప్పుడు ఇలాంటి ఘోరాలు ఎందుకు ఆగుతాయిలే అనిపించింది. అసలు అది హెరాస్మెంట్ అని కూడా తెలీకుండా ట్రాప్ చేస్తే జనాలేమో ఆ అమ్మాయిని తప్పుపడుతున్నారు. ఆడవాళ్లు కూడా ఇలా మాట్లాడడం చాలా దారుణంగా అనిపించింది. ఆమె మైనర్, తనకు ఏం జరుగుతుందో తెలియని వయసు.. అది బరితెగించినట్టు ఎలా అవుతుంది? పిల్లలపై ఏం జరుగుతుందో గ్రహించేంత ఎడ్యుకేషన్ లేదని కదా మనం అర్థం చేసుకోవాలి. తెలిసి లేదా తెలియకుండా తనపై జరిగిన ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఆ అమ్మాయి విక్టిమ్. తన జీవితంలో ఇలా జరిగింది అంటే బాధితురాలిని కాదు బ్లేమ్ చేయాల్సింది. మీ బుర్రలను..
సెక్స్ ఎడ్యుకేషన్ లేమితో తంటాలు..
నిందితుడు చచ్చి బతికిపోయాడు కానీ వాడు ఒక అమాయిక అమ్మాయిని ట్రాప్ చేసి, తనకు అనుకూలంగా మలచుకుని, ఇదేమి తప్పు కాదు అన్నట్టుగా మలుచుకున్నాడు. అదే ముందుగానే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండుంటే, వీడి లాంటి వాళ్లకు ఈ అవకాశం తగ్గేది కదా.. ముందే పిల్లల బుర్రలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే, ఇలాంటి ఘటనల పట్ల వాళ్లు అలర్ట్ అవుతారు. అసలు ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలియని వాళ్లకు, ఖాళీ కాగితం లాంటి బుర్ర ఉన్న పిల్లలకు.. దాని మీద ఏది కరెక్ట్ అని రాస్తే అదే వాళ్లు ఫాలో అవుతారని కనీసం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
మొబైల్ ఇవ్వం అంటే కుదరదు..
పిల్లలకు మొబైల్ ఇవ్వం అంటే కుదిరే పరిస్థితులు కావు ఇవి. అప్‌డేటెడ్ డిజిటల్ చదువుల్లో, మొబైల్, లాప్‌టాప్ వాడకాలు చాలా పెరిగాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దాదాపు అన్నిరంగాల్లో లాగే చదువు కూడా డిజిటలైజ్ అయింది. ఏఐ యుగం ఇది. పిల్లలు ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి అన్నిరకాలుగా మనం చేయూతను ఇవ్వాలి. అలాగే వాళ్లను కనిపెడుతూ ఉండాలి. ఫ్రెండ్లీ పేరెంటింగ్‌తో పిల్లలకు తల్లిదండ్రులు నిరంతరం ప్రేమగా, మానసికంగా దగ్గరగా, చనువుగా ఉండాలి. ప్రేమతోనే కనిపెట్టుకోవాలి.
కోర్టులకూ, కర్మసిద్ధాంతానికీ తేడా ఉండదు!
మొట్టమొదటగా పెళ్లికి ముందే కాబోయే జీవిత భాగస్వాములకు వైవాహిక జీవితం, హెల్తీ పెయిర్‌పై కౌన్సిలింగ్ అవసరం. ఏ మాత్రం అవగాహన లేకుండానే చాలామంది తల్లులవుతున్నారు. నిందితుల విషయంలో ఒకసారి న్యాయవ్యవస్థ పునరాలోచించాలి. ఎక్కడ లోపం జరుగుతుందని స్టడీ చేయడానికి క్రైమ్ రిపోర్టులు మొదలైనవి చాలా ఉన్నాయి.. కేవలం శిక్షించడమే మా బాధ్యత, టిట్ ఫర్ టాట్, వాడు హర్ట్ చేశాడు కాబట్టి వాడు కూడా హర్ట్ అవ్వాలి అన్నట్టుగా వ్యవహరిస్తే కోర్టులకు, కర్మసిద్ధాంతం మాట్లాడే సామాన్యులకు తేడా ఉండదు.
మొహం మీదే మాటలు విసరొద్దు..
ఇప్పుడు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరం, ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఆ పిల్ల జీవితంలో ఏ రకంగానూ దుష్ప్రచారం చేయకుండా ఆమెను కాపాడుకోవాలి. ఆ పిల్ల పరిస్థితి ఏంటి అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఊహాగానాలు రాస్తున్నారు.. ఆ అమ్మాయికి ఇప్పుడు సమాజం నుంచి సపోర్ట్ అవసరం. అది చేయకుండా ఇలాగే మొహం మీదే మాటలు విసిరితే మార్పు ఏం వస్తుంది? మన బుర్రల్లో గుజ్జు సరిగ్గా లేదు అని కూడా ఇలాంటి ఘటనలు ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి.. కాబట్టి మనకూ ట్రీట్‌మెంట్ అవసరమే.
-శ్రీనిధి విప్లవశ్రీ
63025 00028






