- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation sindoor: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. పాకిస్తాన్‌కి చైనా మద్దతు ఎందుకు?
ఆపరేషన్ సిందూర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏక కాలంలో దాడులు నిర్వహించాయి.

భారత సైన్యం జూలు దులిపింది. పాకిస్తాన్ ఉగ్ర పీచమడిచింది. అబల అపరకాళిగా మారి నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్ర దాడికి ప్రతీకగా ఉగ్ర స్థావరాలని నేల మట్టం చేసింది. పద్దతిగా, ప్లానింగ్‌తో పాక్‌లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో భారత్ చూపించింది. త్రివిధ దళా లు అత్యంత సమన్వయంతో నిర్వహిం చిన ఆపరేషన్ సిందూర్ కోసం భారత్ రక్షణ అక్షయ తుణీరంలోంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది.
ఆపరేషన్ సిందూర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏక కాలంలో దాడులు నిర్వహించాయి మన త్రివిధ దళాలు. కాగా, ప్రపంచదేశాలు మన సైనిక చర్యకు సమర్థించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా దానిని అంతం చేయ్యాలని అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో నినదించటం పాకి స్తాన్‌కు మింగుడు పడని ఆంశం.
అత్యంత సమన్వయంతో..
పాక్‌లో ధ్వసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలపై దాడులను మన వాయుసేన ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకొన్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీరిఐ విమానాలు, ఎంక్యూలి డ్రోన్లతో సహకారం అందించింది. భారత్ తాజా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫేల్ నుంచి స్కాల్ప్ క్షిపణులను ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగించారు.
అంతర్జాతీయంగా పాక్ ఏకాకి!
ఇక తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్‌ని ఏ దేశం కూడా నమ్మలేదు. ఈ సమావేశంలో భద్రతా మండలిలోని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత్‌కి వ్యతిరేకంగా పాకిస్తాన్ చెప్పిన విషయాలను భద్రతా మండలి సీరియస్‌గా తీసుకోలేదు. కొన్ని దేశాలు ఈ దాడిలో లష్కరే తోయిబా ప్రమేయం ఉందా..? అని ప్రశ్నిస్తే దీనికి పాకిస్తాన్ దగ్గర సమా ధానం లేదని నివేదికలు చెబుతున్నాయి.
ఆ దేశంతో ఏ ప్రయోజనమూ లేదు!
ఇది కాకుండా, యూరప్ దేశాలు, అమెరికా కూడా పాకిస్తాన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రపంచంలో పాకిస్తాన్ వల్ల ఏ దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్ని దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. చైనా విషయానికి వస్తే డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్‌లో చేపట్టిన బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ఉండటం వల్ల పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. పాక్‌లోని గ్వాదర్ పోర్ట్ వంటి తమ ఆస్తులకు ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆ దేశం భయపడుతోంది. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చు కున్న తీరు అ దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి. మన సైన్యం చాలా శ్రద్ధగా కొట్టింది. పద్దతిగా ఉగ్ర స్థావరాన్ని మట్టుబెట్టింది. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445






