- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation sindoor: సిందూర్ సక్సెస్.. కానీ ఇప్పుడే జాగ్రత్త అవసరం!
భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారింది. మంగళవారం

భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారింది. మంగళవారం అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల వరకు దాదాపు 25 నిమిషాల వరకు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇప్పటి వరకు తొమ్మిది స్థావరాల్లో(పాక్‌లో 5, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 4) వంద మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారు. భారత స్త్రీల సిందూరాన్ని నేలరాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా ‘సిందూర్’ అని ఈ దాడికి నామకరణం చేశారు. 1971 తర్వాత మూడు దశాలు(వైమానిక, నేవీ, ఆర్మీ) పాల్గొన్న దాడి ఇదే. చనిపోయిన ఉగ్రవాదులు, వారి పేర్లు, వారి గురించిన పూర్తి వివరాలు బయటకు వస్తే, ఉగ్రవాదంపై భారత్ జరిపిన కీలకమైన దాడిగా ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది. అంతర్జాతీయ సమా జంలో భారత్ కీర్తి వెలుగుతుంది. ఇదంతా భారత సైనికులు ధైర్యసాహసాలకు దక్కాల్సిన గౌరవం. వారి శక్తికి, శ్రమకు దక్కిన ఫలితం. అయితే మన ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తప్పకుండా కుయుక్తులు పన్నుతుందని, ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో ఇకపై మరింత జాగ్ర త్తగా వ్యవహరిస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే కొంతకాలంపాటు దేశంలోని ప్రముఖ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాలు, సున్నితమైన ప్రాంతాల్లో గట్టి నిఘా అవసరం. ఏమాత్రం అనుమానం ఉన్న ప్రాంతానికైనా ప్రజలు వెళ్లకపోవడం మంచిది. ఎక్కువ మంది గుమికూడే చోట మరింత భద్రత అవసరం. ఉగ్ర నేపథ్యం అను మానం ఉన్నవారిపై రహస్య నిఘా ఉంచాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మతాలకతీతంగా అందరూ ఐక్యమత్యంగా ఉంటే ఉగ్రవాదం తోకముడుస్తుంది.
- విశీ






