- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చక్కని తెలుగు మాట్లాడితేనే.. చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలరు!
రెండు, మూడు తరాలకు ముందు వరకు మన పాఠశాలల్లో దాదాపుగా తెలుగు మీడియమే ఉంది. అప్పుడు చదువుకున్న

రెండు, మూడు తరాలకు ముందు వరకు మన పాఠశాలల్లో దాదాపుగా తెలుగు మీడియమే ఉంది. అప్పుడు చదువుకున్న చాలామంది నాయకులను, ప్రజలను గమనించినట్లైతే వారు తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడేవారో అంతే శ్రావ్యంగా ఇంగ్లీషు మాట్లాడేవారు.. ఎందుకంటే వారు ఇంగ్లీషును ఒక సాహిత్య స్థాయిలో నేర్చుకున్నారు. ఆనాటి మహా మహా తెలుగు రచయితలు, కవులు ఇంగ్లీషు ద్వారా ఇతర భాషల నుండి బోలెడన్ని అనువాదాలు తెచ్చారు.. ఇంగ్లీషులోనూ రచనలు చేయగలిగారు. అలాగే సాంకేతిక విద్యలు చదివిన వారు సైతం చక్కని తెలుగు మాట్లాడే వారు, రాసేవారు.. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో చదివే వాళ్లకు తెలుగులో మాట్లాడటం, రాయడం ఎలాగూ పోయింది. ఇప్పటి వాళ్లకు ఇంగ్లీషు సాహిత్యం చదవడం అస్సలు తెలియడం లేదు. వృత్తి కోర్సులకు అవసరమైన పదజాలం మాత్రమే నేర్చుకుంటున్నారు, నేర్పుతున్నారు. మేనేజ్మెంట్ స్కిల్స్ పేరుతో కొంత, కమ్యూనికేషన్ స్కిల్స్ పేరుతో కొంత, పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో కొంత, స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో ఇంకొంత.. ఇలా ముక్కలు ముక్కలుగా నేర్చుకునే ఇంగ్లీషే తప్ప సాహిత్యం చదివే, సంస్కృతిని అర్థం చేసుకునే ఇంగ్లీష్ నేర్చుకునే వారు గానీ, నేర్పేవారు గానీ చాలా చాలా అరుదుగా నేడు కనిపిస్తున్నారు ఇదీ నేటి సత్యం. ఒకటి మాత్రం నిజం... చక్కని తెలుగు మాట్లాడగలిగిన వారే చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలరు! ఇది ఒక చారిత్రక, సత్యం!!
రత్నారావు
(సోషల్ మీడియా సేకరణ)






