- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లోనైనా మార్పును స్వీకరించు...
"మనుషుల కంటే జ్ఞాపకాలే అందంగా ఉంటాయి. ఎందుకంటే అవి ఎప్పటికీ మారవు" ఇంకా ఇలాంటి కోట్స్ స్టేటస్ లు పెడుతూ ఎన్నిరోజులు ?

"మనుషుల కంటే జ్ఞాపకాలే అందంగా ఉంటాయి.. ఎందుకంటే అవి ఎప్పటికీ మారవు.." ఇంకా ఇలాంటి కోట్స్ స్టేటస్ లు పెట్టుకుంటూ ఎన్నిరోజులు లోలోపలే కుమిలిపోతూ బ్రతుకుతావు చెప్పు. జరిగిందేదో జరిగిపోయింది. గతం గత: అని వదిలెయ్. ప్రపంచంలో నీకు మాత్రమే సమస్యలు ఉన్నట్లుగా ఇంకెన్నాళ్లు? 2025 కూడా అయిపోయింది. కొత్త సంవత్సరం మొదలవుతోంది. గతాన్ని వదిలేసి.. భవిష్యత్తు కోసం కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించు. న్యూ ఇయర్ రిజెల్యూషన్ పేరుతో టెంపరరీ టార్గెట్స్ పెట్టుకోకు. ఏదైనా మారాలి, మార్చాలి అనుకుంటే కచ్చితంగా దానిని చేసేలా, ఆ మార్పును స్వీకరించేలా రిజెల్యూషన్ తీసుకో. ఇది నీ జీవితం. పాసింగ్ క్లౌడ్స్ మాదిరిగా కొందరు వస్తూ పోతుంటారు. వాళ్లెలా నీకు దూరంగా ఉండి ఆనందంగా ఉన్నారో.. నువ్వు కూడా అలాగే ఉండాలని తెలుసుకో మిత్రమా. మార్పును స్వీకరించు అని నీకు చెప్తున్న నాకు కూడా లోలోపల చాలా బాధలు, బయటికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగని ఏడుస్తూ, ఈ ప్రపంచానికి దూరంగా ఉండలేం కదా. ప్రతీ సమస్యకూ ఒక పరిష్కారం, ప్రతీ బాధ తర్వాత ఆనందం ఉంటాయని మన శ్రేయోభిలాషులు చెప్తుంటారు. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్లీ రాయి. లవ్ ఫెయిల్యూర్ అయితే నీ మంచికే జరిగిందనుకో. లైఫ్ పార్ట్నర్ తో విడాకులైతే నీకు మళ్లీ సింగిల్ లైఫ్ దొరికిందని ఆనందించు. అంతేకానీ నాకేం చేతకాదు అని.. క్షణాకావేశంలో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుని నీ తల్లిదండ్రుల్ని మాత్రం బాధపెట్టకు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా నీలో ఉంది. So Accept the Reality and Change your World with New Beginnings. Throw the Past in The Bin. Lets Start Happy New Year with Happy Face.
రాణి యార్లగడ్డ
సీనియర్ జర్నలిస్ట్






