నితీశ్ మెడలోనే బి 'హారం'

by Ravi |   (  Updated:2025-11-15 00:31:05  IST  )

బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సీట్ల ప్రభంజనం సృష్టించింది. ఆ కూటమిలోని ముఖ్యమైన పార్టీలన్నీ తమ ఓట్ల, సీట్ల శాతాల్ని గణనీయంగా పెంచు కున్నాయి. రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవిని ఎలాగోలా చేతిలోనే ఉంచుకున్న నితీశ్ కుమార్, పదోసారి అధిష్టించడానికి అర్హత పొందారు.

నితీశ్ మెడలోనే బి హారం
X

బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సీట్ల ప్రభంజనం సృష్టించింది. ఆ కూటమిలోని ముఖ్యమైన పార్టీలన్నీ తమ ఓట్ల, సీట్ల శాతాల్ని గణనీయంగా పెంచు కున్నాయి. రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవిని ఎలాగోలా చేతిలోనే ఉంచుకున్న నితీశ్ కుమార్, పదోసారి అధిష్టించడానికి అర్హత పొందారు. ఆయన పార్టీ జేడీయూ కూడా అధిక సంఖ్యలో సీట్లు సాధించి, కూటమిలో మొదటి స్థానం పొంది పదవిని దర్జాగా పొందే స్థితిలో ఉన్నారు. బీజేపీ కూడా నాయకుడిగా ఆయన పేరే చెప్తూ వచ్చింది. కాబట్టి అన్నీ వారు అనుకున్నట్టే జరగొచ్చు. బీజేపీ ఎటూ బలంగానే ఉంది. అయితే ఈ సారి చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జీపీ కూడా మంచి ఫలితాల్ని రాబట్టింది. ఆయన బిహార్ భవిష్యత్ రాజకీయాల్లో స్థానాన్ని మెరుగుపర్చుకుంటున్నట్లే. ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకి నానాటికీ తీసికట్టుగా ఫలితాలు వస్తు న్నాయి. తర్వాత పరాజిత స్థానం ఆర్జేడీది. ఓట్లు మరీ దారుణంగా తగ్గలేదు. దాదాపు 29 శాతంతో బాగానే ఉన్నట్టుంది. కానీ సీట్లు మాత్రం బాగా తగ్గాయి. ప్రశాంత్ కిషోర్‌ని కూడా రాజకీయ నేతగా భావిస్తే మాత్రం పరాజితుల్లో మొదటి స్థానం ఆయనదే. కానీ ఎవరూ అలా భావించడం లేదు. కాబట్టి ఎక్కడా డిపాజిట్లు రాకపోయినా మాట్లాడేవారు లేరు. స్థూలంగా, పైపైన చూస్తే ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు చక్కగా ఉండి సత్ఫలితం పొందింది. వారి మధ్య కెమిస్ట్రీ విజయవంతం. అవగాహన, అంకెలు కూటమికి కలిసి వచ్చాయి. మహిళా ఓట్ల పెరుగుదల నితీశ్ వైపే మొగ్గింది. అత్యంత వెనుకబడిన వర్గాలు, మహిళలు ఎన్డీయే వెంట నిలిచారు. ఇది నితీశ్, మోడీ జోడీల ఉమ్మడి విజయం. ఈ ఘన విజయం వల్ల ప్రత్యేక ఎలోక్టోరల్ రివిజన్‌పై కమ్ముకున్న నీలి నీడల్ని విస్మరించరాదు. ఆ ప్రక్రియ లోప రహితం, సందేహాతీతంగా జరిగేలా చూడాలి. ఏది ఏమైనా చరిత్ర సృష్టించిన ఎన్డీయే కూటమికి అభినందనలు.

-డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story