- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Turmeric Board: నిజామాబాద్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం!
సగటు భారతీయుడి దైనందిన జీవితంలో పసుపు అత్యంత కీలకమైనది. ఆధ్యాత్మికత, ఔషధ గుణం, ఆహారం.. అన్నీ కలగలిసిన అత్యంత పవిత్రమైనది

సగటు భారతీయుడి దైనందిన జీవితంలో పసుపు అత్యంత కీలకమైనది. ఆధ్యాత్మికత, ఔషధ గుణం, ఆహారం.. అన్నీ కలగలిసిన అత్యంత పవిత్రమైనది పసుపు. ఇది అన్నదాత పండించే పసిడి పంట. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసుపు పాత్ర అతిముఖ్యమైనది. పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమం కూడా సంపూర్ణం కాదు. అంతలా మన జీవితం నిత్యం పసుపుతో ముడిపడి ఉంది. మన పూర్వికులు కొన్ని వందల ఏళ్ల క్రితమే పసుపులో యాంటిబయోటిక్ గుణాలున్నాయని గుర్తించారు. మన భారతీయులు ప్రపంచానికి అందించిన దివ్య ఔషధ వర్ధిని పసుపు.
వాడకంలోనే కాదు.. ప్రపంచంలో పసుపును పండించే అతి కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణలో ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను విస్తృతం గా సాగు చేస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పసుపు వెరైటీ ఉన్నా కూడా నిజామాబాద్ ప్రాంతంలో పండే పసుపు రకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు పసుపు పంటను పండించిన రైతులు, ఆర్థికం గా ఎంతో లాభాలు పొందేవారు. అయితే పె రిగిన పెట్టుబడులకు తగ్గట్టుగా మద్దతు ధర పెరగకపోవడంతో, పసుపు పంటకు, పండిం చే రైతులకు గడ్డు పరిస్థితులు మొదలయ్యా యి. దీంతో తమకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు కావాలని రైతులు ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే మద్దతు ధర దొరుకుతుందని, నాణ్యమైన వంగడాలు, మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుందని, దేశం లోనే ఎక్కువగా, నాణ్యమైన పంట పండించే తమకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని రైతులు ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.
ఎన్నికల్లో కీలక అంశంగా మారి..
ప్రత్యేక తెలంగాణలో అయినా, తమ బతుకులు మారుతాయని అనుకున్న పసుపు రైతులకు, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. నేను పసుపు బోర్డు తీసుకుని వస్తానని, 2014లో కల్వకుంట్ల కవిత ఎంపీగా నిలబడ్డారు. కానీ గెలిచిన తర్వాత ఆమె పసుపు బోర్డు తీసుకురా కపోగా, పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం తరపున, పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో పసుపు రైతులు తమ ఉద్యమాన్ని కేంద్రానికి వినపడేలా పోరాటం మొదలుపెట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు కీలక అంశంగా మారింది. నాటి ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది పసుపు రైతులు నామినేషన్ వేశారు. ఈ సమయంలోనే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు బీజేపీ నేత అర్వింద్ ధర్మపురి. ఈ రైతుల గోసను గుర్తించిన అర్వింద్, తాను ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డుతో పాటు, పసుపు పంటకు మద్దతు ధర తీసుకురాలేని పక్షంలో రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటానని బాండ్ పేపర్ మీద సంతకం చేసి, హామీ ఇచ్చి మరీ బరిలోకి దిగారు. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం విషయంగా మారింది. దీంతో 2019 ఎన్నికల్లో పసుపు రైతులు స్వచ్ఛందంగా అర్వింద్‌కు మద్దతు పలికారు. పసుపు రైతుల మద్దతుతో అర్వింద్ ఎంపీగా విజయం సాధించారు.
ఎంపీగా గెలిచాకా..
నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన పసుపు బోర్డు సాధించేందుకు చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎప్పుడు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వచ్చినా సరే పసుపు బోర్డు ఏర్పాటుపై ఆయన వినతి పత్రాలు ఇచ్చేవారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తి గతంగా కలిసి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే దేశానికే మేలు కలుగుతుందని అనేక సార్లు వివరించారు. పసుపు రైతులకు మేలు చేసేందుకు, 2020 జనవరిలో నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయించారు. పుసుపు బోర్డుకు కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు, పసుపు బోర్డు ఏర్పాటును ఆలస్యం చేస్తున్నా.. ఎంపీ అర్వింద్ వెనుకడుగు వేయలేదు. ఇక పసుపు బోర్డు కంటే ముందే, రైతులకు మద్దతు ధర కలిగించేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన కృషి వల్ల గతంలో 5వేల రూపాయలుగా ఉన్న ధర 2023లో ఏకంగా క్వింటా ల్‌కు 22వేల రూపాయలు పలికింది. ఇప్పుడు సగటున క్వింటాల్‌కు 17వేలుగా రైతుల పంటకు ధర లభిస్తోంది. దాంతో రైతులు, అనేక సంవత్సరాల తర్వాత, పండించిన పంటకు లాభాలు పొందారు. ధర పెరుగు దలతో, పసుపు సాగు కూడా విస్తరించింది. పసుపు ధర భారీగా పెరగడం, స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ ఏర్పాటు కావడంతో.. మరింత నమ్మకంతో, అర్వింద్‌ను రెండోసారి కూడా నిజామాబాద్ ప్రజలు ఎంపీగా, భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ దిశగానే అర్వింద్ చేసిన కృషితో, 2023 అక్టోబర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఎంపీ కృషి వల్లే..
ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లుగానే పసుపు బోర్డును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండగ దినాన పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ఎంపీ అర్వింద్‌తో కలిసి ప్రారంభించారు. పసుపు బోర్డ్ చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించారు. ఈ బోర్డు ఏర్పాటు కేవలం అర్వింద్ కృషి వల్లే సాధ్యమైందని కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇక ఈ బోర్డుతో నిజామాబాద్ పసుపు రైతుల దశ మారనుంది. ఇప్పుడు పంట దిగుబడులు పెంచుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. నాణ్యత ప్రమాణాలతో పాటు శాస్త్ర వేత్తలు, అధికారుల సలహాలు అందుతాయి. బోర్డు వలన మద్దతు ధరతో పాటు ఎగుమతులకు కూడా వీలు కలుగుతుంది. సప్లై చైన్ నుంచి మౌలిక వసతుల ఏర్పాటు కూడా జరుగుతుంది. ఫార్మా సహా ఇతర కంపెనీలకు నాణ్యమైన పసుపు రకాలను అమ్ముకుని రైతులు అధిక లాభం పొందే అవకాశం ఉంది. దశాబ్దాలుగా కలలుగన్న నిజామాబాద్ రైతుల కోరికను ఎంపీ అర్వింద్ తన పోరాట పటిమతో సాధించారు. పసుపు బోర్డు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు ఈ పసుపు కూడా స్పైసెస్ బోర్డులోనే ఉండేది. కానీ దానికి ప్రత్యేకంగా పసుపు బోర్డును సాధించిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విజయం తెలంగాణ రాజకీయాల్లోనే ఒక మైలురాయి.
-బొమ్మ శరత్ గౌడ్
రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేవైఎం, తెలంగాణ
96146 33333






