మోరల్ X రియల్ పాలిటిక్స్!ఆ పార్టీ చీఫ్ ఎన్నిక బీజేపీని భయపెడుతుందా?

by Disha edit |
మోరల్ X రియల్ పాలిటిక్స్!ఆ పార్టీ చీఫ్ ఎన్నిక బీజేపీని భయపెడుతుందా?
X

ఎన్‌సీ‌పీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జే‌డీ, జేఎంఎం, సమాజ్‌వాది పార్టీ, బీ‌ఎస్‌పీ చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సైతం ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల భయంలో ఉన్నారు. ఈడీ విచారణను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా‌గాంధీ, రాహుల్‌గాంధీ కూడా ఎదుర్కున్నారు. రాహుల్ దేశం కోసం 'భారత్ జోడో యాత్ర' మొదలు పెట్టారు. దేశ ప్రజల నుంచి మోరల్ పాలిటిక్స్ కోసం మద్దతు కోరుతున్నారు. అసమానతలు లేని సమాజం కోసం కుల, మతాలకు అతీతమైన పరిస్థితుల కోసం తాపత్రయం కనిపిస్తున్నది. నిరుద్యోగం, పెరిగిన నిత్యావసరాల ధరలు ఎలా దేశాన్ని పట్టి పీడిస్తున్నాయో అయన తన పాదయాత్రలో చెబుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తున్నది. సామాన్యుడి ఆదాయం పడిపోతున్నది. గౌతమ్ అదానీ రూ.12 లక్షల 42 వేల కోట్ల రూపాయలతో ప్రపంచంలో రెండో స్థానం ఆస్తిపరుడుగా మారాడు.

భారతదేశంలో మోరల్ పాలిటిక్స్ వర్సెస్ రియల్ పాలిటిక్స్ 2024 లో కనిపించబోతున్నాయి. 'భారత్ జోడో యాత్ర' ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మోరల్ పాలిటిక్స్‌కు తెరలేపారు. రాహుల్‌ యాత్రకు అనూహ్య స్పందన కనిపిస్తున్నది. సామాన్యుడి మాదిరిగా, కుటుంబసభ్యుడి మాదిరిగా, ఆప్తుడి మాదిరిగా జనంలో ఆయన కలిసిపోతున్న తీరుకు యువత, వృద్ధులు, చిన్న పిల్లలు, ముఖ్యంగా అమ్మలక్కలు ఫిదా అయిపోతున్నారు. 5 వేలు, 10 వేలు, 25 వేలు, 50 వేలు దాటి రాహుల్ వెంట జనం యాత్రలో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోతున్నదని, సీనియర్లు వెళ్లిపోతున్నారని ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో రాహుల్ యాత్రకు పార్టీలో విలువ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇటు బీజేపీ, పీఎం నరేంద్ర మోడీ రియల్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.

అధికారానికి దూరంగా రాహుల్ మోరల్ పాలిటిక్స్, నిత్యం అధికారం కోసమే బీజేపీ రియల్ పాలిటిక్స్ కొనసాగుతున్న పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. నెహ్రూ కాలంలోనూ అయన పాలసీలను వ్యతిరేకంచే సమాజ్‌వాదీలు ఉండేవారు. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు తదితరుల కాలంలోనూ వారి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే కమ్యూనిస్టులు ఉండేవారు. 2014 నుంచి బీజేపీ, పీఎం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల భయం అందరినీ వెంటాడుతున్నది. 120కి పైగా ఈడీ కేసులు ఈ మధ్యకాలంలో నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల మీద 72 శాతం కేసులు లేదా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్స్ మంత్రులుగా కొనసాగుతున్న కాలం ఇది.

రాహులే పార్టీ చీఫ్ కావాలి

ఈ తరుణంలోనే కాదు, 2013లోనూ రాహుల్ మోరల్ పాలిటిక్స్ గురించి మాట్లాడేవారు. మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నపుడు నేరస్తులు ఎన్నికలలో పోటీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే రాహుల్ చించేశారు. అఫిడవిట్ ఇచ్చినా సరే, వారు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వరాదనేది ఆయన ఉద్దేశం. ఈ విషయం పార్టీలో చర్చిస్తామని కూడా అన్నారు. రాజకీయాలలో ఆదర్శ స్థితి కోసం ఆయన అన్వేషిస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనూ యువకులను సీఎంలను చేయాలనే అనుకున్నారు. వృద్ధ నేతలు అడ్డుతగిలారు.

దేశ రాజకీయాలను మార్చాలని రాహుల్ భావిస్తున్నారు. ఇప్పుడు ఏఐసీసీ చీఫ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. రాహులే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలి. అదే పార్టీకీ, దేశానికీ శ్రేయస్కరం. ఇదివరకు ఓసారి రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తిరిగి అది పునరావృతం కారాదు. ఆయన చీఫ్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. రాహుల్‌తో ఎంత ప్రమాదమో తెలుసు కనుకనే ఆయన కాంగ్రెస్ చీఫ్ కావద్దని బీజేపీ కోరుకుంటున్నది. పాదయాత్ర మీద అవాకులు చవాకులు పేలుతున్నది. కాంగ్రెస్ నేతలు దీనిని గ్రహించి రాహుల్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేలా చూడాలి.

అంతటా అవినీతి

నిజానికి 'లీడర్ అమీర్, ప్రజలు గరీబ్' దేశం మనది. ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీగా గెలిస్తే చాలు, వారు కరోర్‌పతి అయిపోతున్నారు. గడచిన మూడేండ్లలో 4,270 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దుకాన్, మకాన్, సినిమా హాల్, గనులు, బార్లు, హోటల్స్, రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంక్స్, ఇసుక బిజినెస్, ఇతర వ్యాపారాలలోకి వెళ్లారు. ఇందులో 70 శాతం మంది బీజేపీతో సంబంధం ఉన్నవారు, బీజేపీ నేతలే ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి ఒక గనిని తన పేరిట తీసుకున్నారు. తప్పు చేయడానికి భయం కూడా లేకపోవడం దారుణం.

దేశంలో కరెప్షన్ ఎంత పరాకాష్టకు చేరిందో స్పష్టంగా కనిపిస్తున్నది. కరెప్షన్ మచ్చను వెంటబెట్టుకుని పాలన చేసే ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ తమ ఎంపీలు కేసులు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా ఖతం చేసుకుని రావాలన్నారు. క్రిమినల్స్‌కు చోటు ఉండదన్నారు కానీ, ఇపుడు అయన మంత్రివర్గంలో ఎందరు క్రిమినల్ కేసులలో ఉన్నారో చూస్తున్నాం. మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. అవే రియల్ పాలిటిక్స్. కేవలం అధికారంలోకి రావడానికి, ఉన్న అధికారాన్ని నిలుపుకోవడానికి వీరు ఇలాంటి రాజకీయాలు చేస్తారు.

వెంటాడుతున్న కేసుల భయం

ఎన్‌సీ‌పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జే‌డీ, జేఎంఎం, సమాజ్‌వాది పార్టీ, బీ‌ఎస్‌పీ చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సైతం ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల భయంతో ఉన్నారు. ఈడీ విచారణను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా‌గాంధీ, రాహుల్‌గాంధీ కూడా ఎదుర్కున్నారు. రాహుల్ దేశం కోసం 'భారత్ జోడో యాత్ర' మొదలు పెట్టారు. దేశ ప్రజల నుంచి మోరల్ పాలిటిక్స్ కోసం మద్దతు కోరుతున్నారు. అసమానతలు లేని సమాజం కోసం కుల, మతాలకు అతీతమైన పరిస్థితుల కోసం తాపత్రయం కనిపిస్తున్నది. నిరుద్యోగం, పెరిగిన నిత్యావసరాల ధరలు ఎలా దేశాన్ని పట్టి పీడిస్తున్నాయో ఆయన తన పాదయాత్రలో చెబుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తున్నది. సామాన్యుడి ఆదాయం పడిపోతున్నది. గౌతమ్ అదానీ రూ.12 లక్షల 42 వేల కోట్ల రూపాయలతో ప్రపంచంలో రెండో స్థానం ఆస్తిపరుడుగా మారాడు.

దేశం రూ.135 లక్షల కోట్ల అప్పులలో కూరుకుపోయింది. వందమంది కార్పొరేట్‌లు బ్యాంకుల నుంచి రూ.11 లక్షల కోట్లు మాఫీ పొంది వాటి దివాళాకు కారణమయ్యారు. మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోడీ జన్మదినం సందర్బంగా ఎనిమిది చీతాలను తెచ్చారు. ఉపాధికి అవకాశాలుంటాయని అంటున్నారు. ఎనిమిదేండ్లలో పది లక్షల ఉద్యోగాలు ఇవ్వని వారు ఇప్పుడు చీతాల పేరు మీద పాలిట్రిక్స్ చేస్తున్నారు. రాజకీయాలలో మార్పు రాకుండా దేశం బాగుపడదు. అందుకు బుద్ధిజీవులు సిద్ధం కావాలి. 2024లో మోరల్ పాలిటిక్స్ వర్సెస్ రియల్ పాలిటిక్స్ మధ్యన జరిగే పోటీలో ప్రజలు ఎటు వైపో ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలి.


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed