- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీనే బెస్ట్ బేరగాడు.. ఎలా?
అమెరికాతో తాజాగా " భారత్" చేసుకున్న ఒప్పందం వాణిజ్య బంధమే కాక వాణిజ్య, సైనిక, రాజకీయ రంగాలకు

అమెరికాతో తాజాగా " భారత్" చేసుకున్న ఒప్పందం వాణిజ్య బంధమే కాక వాణిజ్య, సైనిక, రాజకీయ రంగాలకు ముడిపడ్డ ఒప్పందంగా స్పష్టం అవుతోంది. తగు సందర్భాన్ని బట్టి వాటి గూర్చి మాట్లాడుకుందాం. ఇప్పుడు అమెరికా, భారత్ మధ్య జరిగిన తాజా ఒప్పందం గురించి మాట్లాడుకుందాం.
ఒప్పందాల్లో భాగంగా, రష్యా, చైనా, గల్ఫ్ వంటి దేశాల నుండి సరుకుల కొనుగోళ్ళకు బదులు, అంతకంటే మిం చి ధర చెల్లించి మా అమెరికా సరుకుల్ని మీ భారతదేశం ఇక నుండి కొనుగోళ్లు చేయాలి. అలాగే మా అమెరికాలోని మీ "అక్రమవలసదార్ల"ని మా స్వంత ఖర్చులతో మీ దేశానికి పంపాల్సిన పని మాకు లేకుండా మీ ఖర్చులతో మర్యాదగా మీరే తరలించుకోండి అని మోడీ ఎదుట ట్రంప్ తాజాగా విధించిన రెండు ప్రధాన షరతులు.. (ఇంకా వున్నాయనుకోండి) వాటికి మోడీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఒప్పందం గురించి పైకి ఏ వివరణలు ఇచ్చినా, ఏ పూతలు పూసి రాతలు రాయించినా, వాస్తవ ఆచరణలో ట్రంప్ ఎదుట మోడీ తలవంచాడు. పారితోషికంగా మోడీకి ట్రంప్ ఇచ్చిన కితాబు "బెస్ట్ బేరగాడు". తన కంటే చాలా గొప్ప బేరగాడుగా మోడీకి ట్రంప్ కితాబు ఇవ్వడం వెనక వ్యూహం వుంది. బేరసారాలు చేయకుండా పై షరతులను బేషరతుగా ఒప్పుకోవడమే వాస్తవ వ్యూహం.
మార్కెట్ల యుద్ధంలో ఇది ఓ భాగం!
అమెరికా షరతులకు మోడీ బేషరతుగా అంగీకరించినందుకు మోడీ కి ఓగొప్ప కితాబు లభించింది. సహజంగా సామ్రాజ్యవాద బేరగాళ్ల లక్షణమది. అలా గొప్పగా పొగడడం ద్వారా మన దేశ ప్రజల మనస్సుల్లో మోడీ ఒక గొప్పవాడనే ముద్ర పడవేయాలి. ఆ మహా బేరగాడి పాత్రను ట్రంప్ పోషించాడు. మార్కెట్ల కోసం చేసే సామ్రాజ్యవాద శక్తుల మానసిక యుద్ధంలో ఇదో భాగం. ఏ దేశ పాలకుడు తమ ఎదుట చర్చల్లో అశక్తునిగా మారతాడో, అతడు శక్తివంతునిగా, ఎవరు అసమర్థునిగా రుజువు చేసుకుంటాడో, అతడు సమర్ధునిగా కితాబివ్వడం వారి నైజం. తాము బట్టలు ఊడదీసి వివస్త్రని చేస్తుంటే, అందుకు ఎవరు తలవంచి అంగీకరిస్తారో, అట్టి పాలకుల్ని విలువైన పట్టు పీతాంబరధారిగా కితాబు ఇవ్వడం సామ్రాజ్యవాద పాలకుల నైజం. అలా దిగజారిన పాలకుల దేశాల ప్రజల మనస్సుల్లో వారి ప్రతిష్ట పెంచడానికి తమ మీడియా ద్వారా ప్రచారాల్ని చేపట్టడం కూడా సామ్రాజ్యవాదుల సహజ నైజం. ఈ కొత్త కోణంలో భారతదేశ ప్రజలు పరిశీలించాల్సిన సమయం ఇది. ఎవరు అంగీకరించినా, తిరస్కరించినా రేపటి చేదు నిజమిది. వేచి చూద్దాం.
- పి ప్రసాద్
94907 00715
- Tags
- Trump and modi






