- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవనశైలిలో మార్పులు... ఆరోగ్యానికి ముప్పు
పెరుగుతున్న జీవనశైలి.. వ్యాధులు అన్ని వయసుల ప్రజల జీవితం మీద ప్రభావితం చూపు తున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది.

పెరుగుతున్న జీవనశైలి.. వ్యాధులు అన్ని వయసుల ప్రజల జీవితం మీద ప్రభావితం చూపు తున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది. కానీ ఆధునిక జీవన శైలులలో శారీరక శ్రమ తక్కువగా అవుతుంది. దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో అకాల మృత్యువులకు కారణం ఆధునిక జీవనశైలినే. ఆధునికత పేరుతో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన చేతుల చేత మన ఆరోగ్యాన్ని తుడిచిపెడు తున్నారు. మహానగరాల్లో జీవించే ప్రజల్లో ఈ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 40 లోపు హార్ట్ ఎటాక్ వస్తుండడం కేవలం జీవనశైలిలో మార్పుల వల్లే.. ఆహారం అలవాట్లలో మార్పు, ఫిజికల్ యాక్టివిటీ లోపం, ఒత్తిడి, నిద్రలేమి వలన నానాటికీ జీవన శైలి వ్యాధులు పెరుగుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో మానవుడు ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నాడు. ఈ మానసిక ఆరోగ్యానికి పరిరక్షించే కొన్ని చిట్కాలు ముఖ్య మైనవి. రోజు ఒకే సమయానికి నిద్ర, భోజనం కార్యాచరణ ఉండేలా జీవనశైలి సజావుగా ఉండాలి. కనీసం 30 నిమిషాలు వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయాలి. ఇక ధ్యానం, శ్వాస నియంత్రణతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహా రంలో పండ్లు, కూరగాయలు ఒమేగా వంటి వాటిని చేర్చాలి. నిద్ర పరిపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి. సెల్‌ఫోన్ వినియోగాలను నియంత్రించాలి. ఈ చిట్కాల వల్ల మనసు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జీవితం సంతృప్తికరంగా మార్పు అవుతుంది. ప్రభు త్వం ఆరోగ్యశాఖ ఈ విషయంపై అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలి. అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తమ జీవనశైలి మెరుగుపరుచుకునే కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది.
-ఇరికి మహేష్ ,
98661 35431






