- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరవీరుల కుటుంబాలకు కమిటీలు కాదు.. చర్యలు కావాలి!
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు ఇంకా అమలుకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కమిటీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల ర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. స్వరాష్ట్రంలో వారి కుటుంబాలకు అండగా ఉంటామని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ హామీల అమలు ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అమర వీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పెన్షన్, భూమి ఇస్తామని చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన ప్పటికీ, వారి డిమాండ్ల పట్ల స్పష్టమైన పురోగతి లేదు. ఇప్పటికైనా అమలు చేస్తారనుకుంటే ప్రభుత్వం కమిటీ ఏర్పరచాలని చూస్తోంది. ఇప్పుడు కమిటీ పేరు చెప్పి త్యాగంతో సంబంధం లేని వారిని సభ్యులుగా ఉంచితే వారికి అమరవీరుల బాధలు ఏం తెలుసు? నిజానికి ప్రభుత్వం ఏదైనా సమస్యను దీర్ఘకాలం సాగదీయడానికి కమిటీలను వేయడం సాధా రణమే అయినా, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు కాలయాపనకే పరిమితం కాకూడదని ఆ కుటుంబాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీల ద్వారా తమకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. గత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ప్రస్తుత ప్రభుత్వంలోనూ పునరావృతం కాకూడదు.. అందుకే ‘మాకు కమిటీలు వద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కావాలి’. ఆయనే స్వయంగా స్పందించి, నేరుగా అమర వీరుల కుటుంబాలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి. అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో వారి కుటుంబాల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం తక్షణమే స్పందించి కమిటీలను రద్దు చేసి, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలి. అప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి లభిస్తుంది.
- నరేష్ నాయక్
85005 85982






