- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కులే ప్రధానం కాదు..
విద్యార్థులు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, పాస్, ఫెయిల్ అయ్యామనో బాధపడొద్దు.

విద్యార్థులు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, పాస్, ఫెయిల్ అయ్యామనో బాధపడొద్దు. మార్కులు ప్రధానం కాదు, ఓటమి చెందినప్పుడే విజయం సులువవుతుంది. ప్రపంచంలో మనం సాధించడానికి లక్ష్యాలెన్నో ఉన్నాయి. అందులో మనం ఒకటి సాదిద్ధాం. మనకు విజయం సాధించడానికి కావలసిన మనోధైర్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు చేసుకోగలుగుతారు. పిల్లలలో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రుల నిరాశకు లోనవుతారు. పిల్లలకు జీవితం విలువను గుర్తించేలా పోత్సహించాలి.
మీ శ్రమే ఆయుధం
నేటీ పోటి ప్రపంచంలో తాము అనుకున్నది సాధించాలనే కాంక్ష, ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనలకు లోనవుతూ నిరాశ నిస్పృహలకు లోనయే వారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులు, విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయనే ఆందోళనను దూరం చేయాలి. మానసిక ఆందోళనలను తగ్గించుకోవాలి. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి. సానుకూల ఫలితాలు వస్తాయనే భావంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మంచి మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మెంటారుగా స్పీకరించడం, అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేయాలి. నీ వెనుక ఏముంది.. ముందేముంది.. అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తి సామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధిం చారు. మనమూ సాదిద్దాం. ఇతరులకు ఆదర్శంగా నిలుద్దాం.
( పరీక్షల సందర్భంగా)
- ఇరికి మహేష్
98661 35431






