- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా సంకల్పాలకు చేదోడు
తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రాయలసీమలో నిర్వహిస్తున్నారు. నేటి నుండి మూడు

తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రాయలసీమలో నిర్వహిస్తున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కేవలం పార్టీకి సంబంధించి కాకుండా రాష్ట్ర రాజకీయాల దిశను ప్రభావితం చేసే కీలక వేదికగా మారనుంది.
శ్రమించేవాడిని చూస్తే ఓటమి భయపడుతుంది అని చెప్పిన నిత్య శ్రామికుడు ఎన్టీఆర్. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ విధానాలు అనుసరించడం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి స్పష్టమైన సిద్ధాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత రాజకీయ విలువలతో ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో అవే ఆశయాల కోసం నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కుటిల రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్ర పుటలలో, జన హృదయాలలో ఎన్టీఆర్ చిరస్మరణీయులే. అందుకే ప్రజా నాయకుడిగా చరిత్రలో ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం.
ఎగురుతున్న పసుపు జెండా
రానున్న రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఈ మహానాడు ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అమలు జరుపుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కార్యకర్తలకు దిశా నిర్దేశ వేదికగా మహానాడు మారనున్నది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలిపే అవకాశముంది.
వ్యూహాత్మక ఎత్తుగడ
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2004 నుండి 2019 వరకు కడప జిల్లాలో టీడీపీ నామమాత్రపు స్థానాలతోనే సరిపెట్టుకున్న పరిస్థితి నుంచి 2024లో పెద్ద విజయాన్ని సాధించింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలలో 7 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం గమనార్హం. ఇందులో టీడీపీకి 5, బీజేపీకి 1, జనసేనకు 1 సీటు దక్కాయి. మొట్టమొదటిసారిగా బీజేపీ, జనసేనకు కూడా కడప జిల్లాలో ప్రాతినిధ్యం లభించడం రాజ కీయంగా కొత్త దారులు తెరిచింది. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తయితే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి తెలుగుదేశం మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు.
చర్చించే కీలక అంశాలు..
కడపలో జరుగనున్న మహానాడులో పార్టీ పునర్నిర్మాణం, సామాజిక న్యాయం, అభివృద్ధి ప్రణాళికలు వంటి మూడు ప్రధాన దశల్లో తీర్మానాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా, తెలుగుదేశం పార్టీ యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించింది. ఈ క్రమంలో నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ యోచిస్తున్నది. యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలన్న దృక్కోణంతో 33% రిజర్వేషన్ ప్రతిపాదనను ముందుకు తేవాలని భావిస్తున్నారు. ఇక సామాజిక న్యాయం విభాగంలో, వైసీపీ హయాంలో తగ్గిన బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించాల్సిన అవసరంపై మహానాడులో చర్చ జరుగనుంది. అలాగే జిల్లాల పునర్విభజనలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు అవ సరమైన చట్ట సవరణలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అభివృద్ధి ప్రణాళికల విషయానికి వస్తే, ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి సంక్షేమ పథకాల పునఃప్రారంభం గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రాజెక్టుల పురోగతికి నిదర్శనంగా బనకచర్ల ప్రాజెక్టును PPP మోడల్‌లో చేపట్టే యోచనను కూడా మహానాడులో ముందుకు తేనున్నారు.
కూటమి శక్తి
ఈసారి మహానాడుకు బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా వంటి కేంద్ర మంత్రులు హాజరవుతారనే ఊహాగానాలు ఉన్నాయి. జనసేన నుంచి కూడా మద్దతు లభించనుంది. ఈ మహానాడు వేదికగా పాలనలో తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాలను పార్టీకి మాత్రమే కాకుండా ప్రజలకు కూడా చాటి చెప్పబోతోంది. కడప వంటి ప్రాధాన్యత గల జిల్లాలో మహానాడు నిర్వహించడంలో దాగివున్న సందేశం – రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాక, గతంలో పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నూతన శక్తిని నింపడమే. ఈ మహానాడు, అధికారంలో ఉన్న టీడీపీకి పాలన కు కావాల్సిన ప్రజా సమ్మతి బలాన్ని మరింత బలపరచే వేదికగా నిలవనుంది. అనుభవం వున్న నాయకులతో సమర్ధ పాలన అందించి తెలుగు ప్రజల అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పాలి. కావునా నేడు మరో నలభై ఏళ్ళు యువత తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపే విధంగా తెలుగుదేశం పార్టీని భుజానికి ఎత్తుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి, సమాజానికి ఎంత చారిత్రక అవసరమో ప్రజలకు వివరించాలి. యువతే పార్టీ భవితకి కంకణబద్ధులు కావాలి.
వాడవల్లి శ్రీధర్
99898 55445






