- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో కోట్ల సంఖ్యలో లాటరీ టికెట్ల అమ్మకం.. ఎందుకో తెలుసా?
కేరళలో అన్ని టౌన్‌లలో, గ్రామాల్లో, పట్టణాల్లో, వృద్ధులు ఎవరూ ఖాళీగా లేరు.. పెద్ద వయసు స్త్రీలు, పురుషులు అందరూ హడావుడిగా

కేరళలో అన్ని టౌన్‌లలో, గ్రామాల్లో, పట్టణాల్లో, వృద్ధులు ఎవరూ ఖాళీగా లేరు.. పెద్ద వయసు స్త్రీలు, పురుషులు అందరూ హడావుడిగా, రోడ్లకు అడ్డంగా కొందరు, చెట్ల క్రింద, గొడుగుల కింద కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసా..? లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. ఇంట్రెస్టింగ్‌గా అనిపించి కొందరిని అడిగితే..
కేరళలో లాటరీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది.. ప్రత్యేకంగా లాటరీ మంత్రిత్వ శాఖ కూడా ఉంది. రోజుకు కొన్ని కోట్ల లాటరీ టికెట్లు ప్రింట్ అవుతాయి.. వృద్ధులు, రిటైర్ అయినవాళ్ళు వికలాంగులు, ఇతర పనులు చేసుకోలేని వాళ్ళకు ఏజెన్సీల నుండి లాటరీ టికెట్లు తెచ్చుకొని ఇంటి దగ్గర, రోడ్లమీద, సైకిళ్ళ మీద అమ్ముకుని ఉపాధి కల్పించే అవకాశం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. లక్ ఉంటే ప్రైజ్ మనీలో 10% డబ్బు కూడా రావచ్చు..
కోట్ల సంఖ్యలో లాటరీ టికెట్లు..
ఇన్ని లక్షల టికెట్లు ఎవరు కొంటారని సెర్చ్ చేస్తే.. కేరళ జనాభాలో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆల్మోస్ట్ ప్రతిరోజూ ఒక లాటరీ టికెట్ కొంటారట. వ్యసనం తో కాదు.. ఒక గొప్ప మానవీయ దృక్పథంతో.. అవును లాటరీ టిక్కెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని కేరళ ప్రభుత్వం కేన్సర్ రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు ఉపయోగిస్తుంది. పైగా ప్రభుత్వం ఆధ్వ ర్యంలో లక్షల మందికి గౌరవప్రదమైన ఉపాధితో పాటు కోట్ల రూపాయల డబ్బు గెలుచుకునే అవకాశం ఉంది. గెలుచుకున్న అమౌంట్‌లో 30 శాతానికి పైగా టాక్స్ కట్టాలి. ఎక్కడా ఎలాంటి ఫ్రాడ్ లేకుండా హైటెక్ పద్ధ తిలో ప్రతీరోజూ సాయంత్రం 3.00 గంటలకు తిరువనంతపురంలో డ్రా తీస్తారు. లాటరీ తగిలిన వాళ్ళు తమ డబ్బును ఏజెన్సీ వద్ద టికెట్ చూపించి 90 రోజుల్లో పొందవచ్చు.
వారి ఉపాధి కోసం కొంటామంటూ..
ఒక టీ తాగితే అయ్యే ఖర్చు కాదు, డబ్బులు వచ్చినా రాకున్నా వృద్ధులకు ఉపాధి లభిస్తుందని వాటిని కొంటాం అన్నారు కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. లాటరీ డబ్బులతో ఒక్కసారిగా మిలియనీర్లు అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు.. ప్రభుత్వం క్రిస్మస్‌కు, ఓనమ్‌కు రమజాన్‌కు ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంది. పండుగలలో లాటరీ ఆఫర్ల కోసం ఆ టైంకు స్వదేశానికి చేరుకునే వాళ్ళు ఉన్నా రంటే అతిశయోక్తి కాదు. Win - Win - సోమవారం, స్త్రీ శక్తి - మంగళవారం, అక్షయ-బుధవారం, కారుణ్య- గురువా రం, నిర్మల్- శుక్రవారం, కారుణ్య ప్లస్ - శనివారం ఇవీ రోజువారీ లాటరీ స్కీం లు..
ప్రజా సంక్షేమానికి లాటరీ డబ్బు
ఈ లాటరీ డబ్బును కార్యక్రమాల వారీగా ప్రజా సంక్షేమానికి ఉపయోగి స్తున్నారు.. డ్రా తీసిన క్షణమే విన్నర్ నంబర్లు ఏజెన్సీల వారీగా టీవీల్లో రైల్వే స్టేషన్లలో ఫోన్లలో స్క్రోల్, డిస్‌ప్లే అవుతాయి.. ఐదు వేల రూపాయల ప్రైజ్ వస్తే డైరెక్ట్‌గా ఏజెంట్ దగ్గర.. లక్ష రూపాయల ప్రైజ్ వస్తే జిల్లా ఆఫీసులో, అంతకన్నా ఎక్కువ డబ్బు తగిలితే నేష నలైజ్డ్ బ్యాంక్‌లో అడిగిన ధ్రువీకరణ పత్రాలు చూపించి తీసుకోవచ్చు. ఇటీవల కోటి రూపాయల డబ్బు గెలుచుకున్న ఒక పద్దెనిమిదేళ్ల అబ్బాయి ఒక్కసారిగా షాక్‌కు గురై వెంటనే పోలీసు ప్రొటెక్షన్ కోరాడు. ఆ అబ్బాయిని డబ్బుతో సహా సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.. భలే కదా..
అయితే ఈ టికెట్లు కేరళలోనే చెల్లుతాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళు టికెట్లు కొనొచ్చు. తగిలితే ఆధార్ కార్డ్ చూపించి డబ్బులు తీసుకోవచ్చు.. అమ్ముడుపోని టికెట్లు ఏజెంట్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. తిరిగి వాటిని రీసైకిల్ చేసి ప్రింట్ చేస్తారు. ఆన్‌లైలో టిక్కెట్లు కొనడం నిషేధం. వీళ్ళ దగ్గరే కొనాలి. ఇదీ కేరళ లాటరీ కథ.
రజిత కొమ్ము
ప్రిన్సిపాల్, ప్రభుత్వ కళాశాల
kommurajitha23@ gmail.com






