- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల విజయానికి జీవన నైపుణ్యాలే పునాది!
పాఠ్యపుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, భావోద్వేగ నియంత్రణ, సమయపాలన వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్ విజయానికి ఎలా దోహదపడతాయో వివరిస్తున్న ప్రత్యేక కథనం.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో మాత్రమే ముందుకు సాగలేరు. జీవితంలో విజయవంతం కావాలంటే జీవన నైపుణ్యాలు ఎంతో కీలకమైనవి. ప్రతి పిల్లవాడిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుంది. సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, జీవన నైపుణ్యాలు అందిస్తే వారు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. విద్య అనేది కేవలం మార్కులు సాధించడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు మానవీయ విలువలను పెంపొందించేందుకు దోహద పడాలి. నేటి పిల్లలు సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉన్నప్పటికీ, భావోద్వేగ నియంత్రణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సంభాషణా నైపుణ్యాలు, సమయపాలన, సహనం, క్రమశిక్షణ వంటి అంశాల్లో మరింత శిక్షణ అవసరం. చిన్నప్పటి నుంచే పిల్లలకు జీవన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల పిల్లలు మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. వేసవి కాలంలో పిల్లలను క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తే పిల్లలలో వ్యక్తిత్వ వికాసం సాధ్యపడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ, వారు విద్యాపరంగా సామాజిక పరంగా జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి జీవన నైపుణ్యాలు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందడంలో కూడా ఎంతో దోహద పడతాయి.
-డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ
98661 29052






