- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక ఇబ్బందుల్లో లైబ్రరీలు
గ్రంథాలయం కేవలం పుస్తకాల సముదా యం మాత్రమే కాదు. జ్ఞానం, సమాచారం, కల్పనలకు నిలయం.

గ్రంథాలయం కేవలం పుస్తకాల సముదా యం మాత్రమే కాదు. జ్ఞానం, సమాచారం, కల్పనలకు నిలయం. ఇది చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు, మరెన్నో అంశాలపై అపారమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ గ్రంథాలయాలు మన సమాజంలో బహుముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి అందిం చాయి. వీటి ద్వారా చరిత్ర, సాహిత్యం నుండి సైన్స్ & టెక్నాలజీ వరకు విభిన్న విషయాలపై సమాచారం తెలుస్తుంది. ఇవి పుస్తకాలకు ప్రాప్యతను అందించడం, పఠన కార్యక్రమాలను నిర్వహించడం, చిన్న వయస్సు నుండే చదవడాన్ని, అక్షరాస్యతను ప్రోత్సహిస్తాయి.
గ్రంథాలయాల్లో నిధుల కొరత!
అయితే, విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయాలు ఏళ్ల తరబడి గ్రంథపాలకులు లేక వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేవు. మరికొన్నింటిలో పుస్తకాలు అమర్చడానికి అవసరమైన ఫర్నీచర్, కూర్చోవడానికి కుర్చీలు, మూత్రశాలలు లాంటి కనీస మౌలిక వసతులు లేవు. ఇక గ్రంథాలయాలలో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి, భవనాలను నిర్వహించడానికి, సిబ్బందికి జీతాలు చెల్లించడానికి తగినంత నిధులు కేటాయించక పోవడం. పుస్తకాల నవీకరణ లేకపోవడం కొత్త పుస్తకాలు, జర్నల్స్, ఇతర వనరులను కొనుగోలు చేయడానికి నిధులు లేకపోవడం వల్ల గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు పాతబడిపోతున్నాయి. చాలా వరకు గ్రంథాలయాలు పాత భవనాల్లో ఉన్నాయి. ఈ భవనాలు శిథిలావస్థలో ఉండటం వల్ల పాఠకులు అక్కడ కూర్చొని చదవడానికి ఇబ్బంది పడుతున్నారు. అం దుకే వీటిని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆధునీకరించాలి.
చదువుకోవడానికి ఇబ్బంది
ఇక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ అభ్యర్థులు ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇక ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందంటే గ్రంథాలయాలు కూర్చోవడానికి చోటు లేకుండా కిక్కిరిసిపోతాయి. అలాగే గ్రంథాలయాలయాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో నిర్వహణ కుంటుపడుతోంది. సుమారు 30 ఏళ్లుగా రెగ్యులర్ పోస్టుల నియామకాల ఊసేలేదు. 1994లో నియమించిన వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. తాత్కాలిక పద్ధతిన గ్రంథాలయ సంస్థే ఆడపాదడపా ఒప్పంద ఉద్యోగులను నియమిస్తోంది. అందుకే ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీని, ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి లైబ్రేరియన్‌ను నియమించాలి. త్వరలో వేసే మెగా డీఎస్సీతో పాటు లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేయాలి.
సిలివేరు అశోక్
ఉస్మానియా యూనివర్సిటీ
77806 81801
- Tags
- Library problems






