- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రంథపాలకులు లేక గ్రంథాలయాలు విలవిల..
తెలంగాణలో ప్రభుత్వ గ్రంథాలయాల దుస్థితి, మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన లైబ్రేరియన్ నియామకాలు, నిధుల కొరత, మౌలిక వసతుల లేమి, లైబ్రరీ సైన్స్ పట్టభద్రుల నిరీక్షణ, గ్రంథాలయాల ఆధునీకరణ అవసరం..

రాష్ట్రంలో విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయాలలో 30 ఏళ్ల నుంచి గ్రంథాపాలకులు లేక వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. విజ్ఞాన భాండాగారాలుగా ప్రసిద్ధి చెందిన గ్రంథాలయాలు నేడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేత నిర్వీర్యం అవుతున్నాయి. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల సముదాయం మాత్రమే కాదు ఇది చరిత్ర , సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళల సముదాయం. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిని అందించాయి.
బహుముఖ పాత్ర పోషిస్తూ..
గ్రంథాలయాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బంది కూడా తగినంతగా శిక్షణ లేకపోవడం వల్ల పాఠ కులకు సరిగా సహాయం చేయలేకపోతున్నారు. గ్రంథాలయాలు మన సమాజంలో బహుముఖ పాత్ర పోషిస్తాయి. గ్రంథాలయాలు విస్తృతమైన పుస్తకాలు, పత్రికలు, ఇతర వనరులను కలిగి ఉంటాయి, చరిత్ర, సాహిత్యం నుండి సైన్స్, టెక్నాలజీ వరకు విభిన్న విషయాలపై సమాచారాన్ని యాక్సెస్ చేస్తాయి. దాని ద్వారా నాలెడ్జ్ సెంటర్‌గా ఉంటున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల అభ్యాసకులకు అందించే వనరులు, ప్రోగ్రాములు, సేవలను అందించడం ద్వారా లైబ్రరీలు జీవితకాల అభ్యాసానికి మద్దతు ఇస్తాయి. గ్రంథాలయాలు ప్రజలు ఒకచోట చేరడానికి, ఈవెంట్లకు హాజరయ్యే, చర్చల్లో పాల్గొనడానికి, వారి స్థానిక కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడానికి సమావేశ స్థలాలుగా పనిచేస్తాయి.
లైబ్రేరియన్ నియామకాలు ఎప్పుడు?
సుమారు 32 ఏళ్లుగా రెగ్యులర్ పోస్టుల నియామకాలు ఊసేలేదు 1994 లో నియమించిన వారే ఇప్పటికీ కొనసా గుతున్నారు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలలో, యూనివర్సిటీలో, పబ్లిక్ లైబ్రరీలో అర్హత లేని తాత్కాలిక పద్ధతిన గ్రంథాలయం సంస్థే అడపాదడపా ఒప్పంద ఉద్యోగులని నియమిస్తుంది. దీని వలన గ్రంథాల పాలకులు సరిపడా లేకపోవడంతో ఒక్కొకరికి మూడు, నాలుగు గ్రంథాలయాలు ఇంచార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఎక్కడా సక్రమంగా పని చేయలేకపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ చూపి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసి లైబ్రేరియన్ నియమించాలి.
లైబ్రరీ పీరియడ్ కేటాయించాలి!
అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో విద్యా ర్థులకి లైబ్రరీ పీరియడ్ కేటాయించడం వలన విద్యార్థుల ఆలోచన శక్తి పెరుగుతుంది. రాష్టంలోని గ్రామం, మండల కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి లైబ్రేరియన్ నియమించాలి. త్వరలో రాష్ట్రంలో ప్రకటించే జాబ్ నోటిఫి కేషన్లతో పాటు లైబ్రేరియన్ పోస్ట్‌లు కూడా భర్తీ చేయాలి. ఎంతో మంది లైబ్రరీ సైన్స్ పట్టభద్రులు చాలా ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం లైబ్రరీ సైన్స్ పట్టా భద్రులపైన దృష్టి పెట్టి పబ్లిక్ గ్రంథాలయాలలో, జిల్లా గ్రంథాలయాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్ట్‌లను భర్తీంచేసి నిరుద్యోగులను ఆదుకోవాలి.
నిధుల కొరతతో లైబ్రరీలు..
ఒక వైపు విద్యావ్యవస్థకు గ్రంథాలయాలు వెన్నెముక అని ప్రకటిస్తుంటే మరొక వైపు ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపి స్తున్నాయి. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు లేవు, మరి కొన్ని గ్రంథాలయాల్లో పుస్తకాలు అమర్చ డానికి అవసరమైన కనీస మౌలిక వసతులు లేవు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయలయాల్లో సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. గ్రంథాలయాలలో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి, భవనాలు నిర్మించడానికి సిబ్బంది జీతాలు చెల్లించడానికి, తగినంత నిధులు కేటాయించకపోవడం, ఇతర వనరులను కొనుగోలు చేయడానికి నిధులు లేకపోవడం వల్ల చాలా గ్రంథాలయాలు పాత పుస్తకాలతో, పాత భవనాల్లో ఉన్నాయి. ఈ భవనాలు శిథిలా వస్తలో ఉండటం వల్ల పాఠకులు అక్కడ కూర్చొని చదవ డానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి అయినా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆధునీకరించాలి.
-సిలివేరు అశోక్
77806 81801






