- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీల లక్ష్యసాధనకు మద్దతిద్దాం!
భారతదేశంలో బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌ల కోసం పెరుగుతున్న ఉద్యమం, రాజకీయ ప్రాతినిధ్యం లోపం, బడ్జెట్ కేటాయింపుల్లో అసమానతలు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంపై విశ్లేషణ.

ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీగా ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌లు లేకుండానే 75 సంవత్సరాలు గడిచాయి. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచే ముందు రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ, బీసీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై చర్చించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వారి నిర్లక్ష్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో బీసీ ఉద్యోగుల శాతం 10% దాటకపోవడం, రాజకీయ ప్రాతినిధ్యం 14% లోపే ఉండటం గమనార్హం. బీసీ జనాభా భారీగా ఉన్నప్పటికీ, వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం 0.1%, రాష్ట్రాలు 3% వరకు మాత్రమే నిధులు కేటాయించడం అసమానతను చూపిస్తోంది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు, అధికారంలోకి వచ్చాక బీసీలను నిర్లక్ష్యం చేస్తూ తమ అనుచరులకు పదవులు ఇవ్వడం జరుగుతోంది. తమ సమాజానికి అన్యాయం జరిగినా పదవులు కోల్పోతామనే భయంతో బీసీ నేతలు స్పందించకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఇతర వర్గాల ప్రజాప్రతినిధులు తమ వర్గం ప్రజల సమస్యలపై గళమెత్తుతున్న తీరు చూసైనా బీసీ నాయకులు అనుసరించడం లేదు. బీసీల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఆర్. కృష్ణయ్య కృషి వల్ల కొంత పురోగతి సాధ్యమైంది. ఆయన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ ఎన్నికలలో ప్రభుత్వం 17శాతం రిజర్వేషన్ అమలు చేసినా జనరల్ స్థానాలలో సైతం బీసీలు తమ సత్తా చాటారు.. తదుపరి జరిగిన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 60కి పైగా స్థానాలలో విజయ బహుటా ఎగురవేశారు. బీసీలకు సామాజిక న్యాయం సాధించాలంటే చట్టసభల్లో రిజర్వేషన్‌లు తప్పనిసరి. ఈ లక్ష్య సాధనకు పోరాడుతున్న నాయకులకు ప్రతీ బీసీ పౌరుడు మద్దతిచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
-బూర్గుపల్లి కృష్ణ యాదవ్
98661 70384






