మళ్లీ ప్రేమిద్దాం

by Ravi |   (  Updated:2025-02-21 01:00:43  IST  )

కుటుంబం, పిల్లలలో ఆర్థిక కారణాల వల్ల అనేక సంబంధాలు కాలక్రమేణా మసకబారడం మనం చూస్తాం. గత వారం మనమందరం ప్రేమికుల

మళ్లీ ప్రేమిద్దాం
X

కుటుంబం, పిల్లలలో ఆర్థిక కారణాల వల్ల అనేక సంబంధాలు కాలక్రమేణా మసకబారడం మనం చూస్తాం. గత వారం మనమందరం ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నాం. చాలా జంటలు ఆ రోజును జరుపుకోవడం, ఆ రోజు తర్వాత మర్చిపోవడం మనం చూశాం. కానీ అలా ఉండకూడదు. దీనికి మనం మన జీవన శైలిలో కొంత మార్పును తెచ్చి మార్చుకోవాలి. ఎక్కువగా కటుంబ సభ్యులకు, భాగస్వాములకు కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా, సమయపాలనను కలిగి ఉండటం ద్వారా మనం మళ్లీ ప్రేమను సాధించగలం.

ఒక సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేయడం తప్పు కాదు. ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఎక్కువగా సంభాషించడం, ఆప్యాయతలను, ప్రశంసలను చూపించడానికి తెలివిగా ఎంపికలు చేయండి. సంబంధాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే పనులను చేయండి. ప్రేమ-జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వడం ముఖ్యమని తెలుసుకోండి. భాగస్వాములు ఒకరికొకరు ప్రేమించబడ్డారని భావించేలా వారి ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవం చూపించండి.

సంబంధంలో కమ్యూనికేషన్ కీలకం

జంటల జీవితంలో చాలా సమస్యలు ఉండవచ్చు కానీ మంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ కేవలం మాటల ద్వారా కాకుండా, వంట పనుల్లో కొద్దిగా సహాయం చేయడం ద్వారా కూడా ప్రేమను చూపించగలం. అంతేకాదు ఒక జంటకు కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగ జీవిత ఒత్తిళ్లతో సమస్య ఉంటే, తమను తమ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఇది ఆ జంటలలో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఇక ప్రశాంతమైన జీవితానికి కమ్యూనికేషన్ చాలా కీలకం. కోపాన్ని నియంత్రించడం, గౌరవంగా ఉండటం, ప్రేమ, దయ కలిగి ఉండటం, భాగస్వాములను ఒకరినొకరు నమ్మకం కలిగి, ఒకరికొకరిని పరస్పర గౌరవం ఇవ్వడం ఇద్దరిలో ప్రేమను ఏర్పడటానికి సహాయపడుతుంది.

మీ మధ్య అభిరుచిని మళ్లీ కనుగొనండి!

భాగస్వామిలో ఎవరైనా పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నించాలి. ఇది కలిసి గడిపిన వారి గత మంచి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఇది వారి ప్రేమను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. తాజా ప్రేమకు చెందిన పాత జ్ఞాపకాలకు తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఒకరికొకరు తమ తమ ఆసక్తులను తెలుసుకోవడం ద్వారా శారీరక సాన్నిహిత్యాన్ని కలిగి ఉం డటం, శృంగార సంజ్ఞల ద్వారా కలిసి కొత్త విష యాలు, కొత్త కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించాలి.

బలమైన సంబంధం ఏర్పడాలంటే..!

ఇక కొత్త విషయాలు నేర్చుకోవడంలో అతని, ఆమె ఇష్టాలు కలిసి జ్ఞాపకాలను పంచుకోవడం, ఒకరినొకరు అంగీకరించడం ద్వారా వారి భాగస్వాముల పట్ల కృతజ్ఞత, ప్రశంసలు చూపడం, కలిసి వంట చేయడం లేదా బోర్డ్ గేమ్‌లు ఆడటం వంటి కార్యకలాపాలు కూడా బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి. జంటలు భావోద్వేగ మద్దతును అందించడం ద్వారా, వ్యక్తిగత ఎదుగుదల కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండటానికి జంటలు ప్రయత్నించాలి. అలాగే జంటలు కలిసి తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడంలో పరస్పరం పాలుపంచుకోవాలి. ఆర్థిక విషయంలో పిల్లల విషయంలో వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వారికి మంచి అవగాహన ఉండాలి. వ్యక్తులు మళ్లీ ప్రేమ సంబంధంలో పరిణామం చెందడం అంటే ఒకరికొకరు మార్పులకు అనుగుణంగా మారడం, కలిసి నేర్చుకోవడం పెరగడం కొనసాగించడం ముఖ్యం. పెరుగుతున్న సంబంధంలో మీ సరసన భాగస్వామిని వారి స్వంత ప్రత్యేక పద్ధతిలో అంగీకరించడం కూడా చాలా ముఖ్యం. సంవత్సరాలుగా మీ ప్రేమ వారిపై మసకబారలేదని వారు గ్రహించడంలో ఇది సహాయపడుతుంది.

కుటుంబంలో పరస్పర ప్రేమ

పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులను ప్రేమించడం చాలా ముఖ్యం, కీలకం. చాలా మంది పెళ్లయ్యాక తల్లిదండ్రులను మరచిపోయి వారి స్వంత పిల్లలను ప్రేమిస్తుంటారు. కానీ తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం. అలాగే తమ భాగస్వామి కుటుంబ సభ్యులను వారి స్వంత కుటుంబం వలె సమానంగా గౌరవించడం ముఖ్యం. అప్పుడే కుటుంబ బంధం లోతుగా పాతుకుపోతుంది. ఈ ప్రేమ తల్లి కుమార్తె, తండ్రి కొడుకుల సంబంధంలో మనం తరచుగా చూస్తాం. అందుకే వారి పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకరినొకరి తల్లిదండ్రులను తిరిగి ప్రేమించడం ముఖ్యం. తల్లిదండ్రుల బంధం పిల్లల భద్రత, ఆత్మగౌరవం కోసం కీలకం. ఇది తరువాత జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకునే సామర్థ్యాన్ని కూడా వారిలో పెంచుతుంది.

ఇలాంటి చర్యల వలనే చివరికి మీ భాగస్వామితో ప్రేమలో పడటం సాధ్యమవుతుంది అందుకు కొంత సమయం పట్టవచ్చు కానీ చివరికి అది జరుగుతుంది. ఇంకా మీరు నిరుత్సాహానికి గురైతే, మీరు మునుపటి ఆలోచనలు గందరగోళాలలో చిక్కుకొని ఉంటే ఇంకా మీ భాగస్వామితో తిరిగి ప్రేమలో పడే అవకాశాల గురించి ఖచ్చితంగా తెలియకపోతే, సహాయం కోసం అడగడానికి లేదా కౌన్సెలింగ్ మద్దతును కోరడానికి సంకోచించకండి.

ఎస్. సుష్మితా జెస్సికా రూత్ ప్రభు

సైకాలజిస్టు, పీహెచ్‌డి స్కాలర్

91602 56124

Next Story