ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం!

by Ravi |   (  Updated:2025-07-18 00:31:23  IST  )

ప్రపంచంలోనే అత్యున్నతమైన నగరాలలో హైదరాబాద్ మహానగరం ఒకటి. కోటికి పైగా నివసిస్తున్న ప్రజలు, మరి అలాంటి

ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం!
X

ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం! కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటం, ఫుట్ పాత్‌లను ఆక్రమించుకోవడం, సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వంటివి కారణాలు.. అందులో వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, చాలా ప్రాంతాల్లో ఫుట్ పాత్‌లను ఆక్రమించి దుకాణాలు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టడం, తోపుడు బండ్లు రోడ్ల పైనే నిలపడం వల్ల పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తుంది. ఇక వాహనాలు రోడ్ల మధ్యలో ఎదురెదురుగా నడిపిస్తుండటంతో, విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నాం, కొత్త మార్గాలను అన్వేషిస్తునామని చెప్తూనే ఉన్నారు, కానీ నేటికీ రోడ్లపై సమస్యలు అలానే ఉన్నాయి. ట్రాఫిక్ అధికారులు రూల్స్ పాటించని వారికి చలాన్లు విధిస్తున్నారు.. కానీ ట్రాఫిక్ నియంత్రణకు ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు? ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజలకు అందించాల్సిన విధులు కూడా అంతే అవసరం. అధికారులు ఫొటోలు తీయడం, జరిమానాలు విధించడం, వేసిన జరిమానాలు వసూలు చేయడమే కాకుండా, పది జరిమానాలు ఉన్న వాహనాలను సీజ్ చేయగలిగితే వాహనదారులలో మార్పు వస్తుంది. కేవలం డబ్బే ప్రదానం కాదు, ప్రాణమే ముఖ్యం అనేది ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. ట్రాఫిక్ అవగాహన లేకుండా వాహనాలు నడపడం వలన ఇతర ప్రాంతాల వారికి హైదరాబాద్ నగరం మీద దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు పాటించకపోవడం నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. ప్రజలైనా, ప్రభుత్వమైనా వ్యాపార దృక్పధంతో కాకుండా సామాజిక దృక్పధంతో ఆలోచిస్తే అనేక రకాల సమస్యలు రాకుండా నివారించే అవకాశం ఉంటుంది.

-డాక్టర్. వై. సంజీవ కుమార్,

94936 13555

Next Story