బాలికలను బతకనిద్దాం!

by Ravi |   (  Updated:2025-01-23 00:46:11  IST  )

నేడు ఆధునిక సాంకేతికత 5G నుండి 6G ప్రయా ణించే సమయంలో కూడా బాలికలను భారంగా, మగబిడ్డను ఉద్ధరించే వాడిగా చూసే పరిస్థితులు ఉన్నవి.

బాలికలను బతకనిద్దాం!
X

నేడు ఆధునిక సాంకేతికత 5G నుండి 6G ప్రయా ణించే సమయంలో కూడా బాలికలను భారంగా, మగబిడ్డను ఉద్ధరించే వాడిగా చూసే పరిస్థితులు ఉన్నవి. ఆడవారే ఆడపిల్లలు పుడితే జీర్ణించుకుంటలేరు.. ఇదేమి వింతో అర్థం కావడం లేదు. ఆడపిల్ల పుట్టినా పెంపకంలో నిర్లక్ష్యం, విద్యను అందించటంలో చిన్న చూపు, ఇంటిపనులు వస్తే చాలు అనే ధోరణి. బాలికల అభివృద్ధికి, సాంస్కృతిక, సాంఘీక, ఆర్థిక, సామాజిక వికాసానికి ఇవి గొడ్డలి పెట్టు వంటివి. వీటికి తోడు బాల్యవివాహాలు చేయడం, బాల కార్మికులుగా మార్చడం అనే అంశాలు బాలికల సర్వతోముఖాభివృద్ధికి శాపంగా మారుతున్నాయి. తరాలు మారుతున్నా ఈ జాడ్యాలు మనిషి మస్తిష్కాన్ని వదలడం లేదు.

బాల్యవివాహాలు - కారణాలు..

బాలికలు మూడుముళ్ల బంధంలో 18 ఏళ్లు నిండకముందే బందీలవుతున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు, త్వరగా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనే ఆలోచన ధోరణి, సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలకు కలత చెందడం, వీటికి తోడు సామాజిక దురాచారం నుండి బయటపడలేక, చిన్నారులను చదువుకోవాలన్న ఆకాంక్ష నుండి దూరం చేసి బాల్య వివాహాలకు దగ్గర చేస్తున్నారు. తెలంగాణలో బాల్యవివాహాలు ఎక్కువ జరుగుతున్న జిల్లాలు హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలే. మన రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా బాల్య వివాహ కేసులు నమోదవుతున్నాయి.

బాలకార్మికులుగా మారేందుకు కారణాలు..

భారతదేశంలో బాలకార్మిక సమస్య చాలా కాలంగా నాటుకుపోయింది. కానీ, ఈ సమస్యలో బాలికల పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇటుక బట్టిలలో, హోటల్లో, వ్యవ సాయ కూలీగా, శ్రీమంతుల ఇళ్లలో పాకి పని వారిగా చేరుతున్నారు. కొన్ని వర్గాల్లో యువత ఆధునిక సాంకేతికతను ఉపయోగించే తీరుతో భయబ్రాంతులకు గురై వారి సమక్షంలో పిల్లలు ఉంటే క్షేమం అని ఆలోచించి కులవృత్తులో చిన్నవయసులోనే నెట్టేస్తున్నారు. భారతదేశ జనాభాలో 14%వరకు అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 168 మిలియన్స్‌గా బాల కార్మికులు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పరిష్కార మార్గాలు..

బాలికలకు ఉన్నత విద్యను పొందే హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వా మ్య హక్కులపై సంపూర్ణ అవగాహన కల్పించాలి. ప్రతి వ్యక్తి బాలికల హక్కుల రక్షణలో భాగస్వాములు అవు తూ వారి ఎదుగుదలకు కృషి చేయాలి. జవహర్ లాల్ నెహ్రూ అన్నట్టుగా "బాలికలు, బాలురు దేశ నిజమైన సంపద, వారిసంరక్షణ, అభివృద్ధి మన కర్తవ్యం" అనే మాటలు గమనంలో ఉంచుకుని ముందుకు సాగాలి.

(రేపు జాతీయ బాలికా దినోత్సవం)

- మహేశ్వరం భాగ్యలక్ష్మీ

అసిస్టెంట్ ప్రొఫెసర్

95056 18252

Next Story