- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాల్లో వలస వ్యతిరేక నిరసనల నుండి భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాలు..
మూడు దశాబ్దాలుగా గ్లోబలైజేషన్ వలన దేశంలోని మధ్య తరగతి కుటుంబాలు నుంచి చదువు నిమిత్తం ఇతర దేశాలకు వలస వెళ్లడం..

మూడు దశాబ్దాలుగా గ్లోబలైజేషన్ వలన దేశంలోని మధ్య తరగతి కుటుంబాలు నుంచి చదువు నిమిత్తం ఇతర దేశాలకు వలస వెళ్లడం.. ఒక పక్క చదువుకుంటూ, మరోవైపు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తూ స్థిరపడటం జరుగుతుంది. ప్రభుత్వం సహకరించడం, బ్యాంకులు ఇందుకు రుణాలు మంజూరు చేయడంతో ప్రతీ ఏటా లక్షలాది యువత ఇతర దేశాలకు వలసలు వెళ్లడం జరుగుతుంది..
అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులతో సహ అన్ స్కిల్డ్ ప్రజలు అక్కడి కి పయనం అవుతున్నారు. ఇక్కడే అక్కడి స్థానికుల్లో అలజడి, ఆందోళన ప్రారంభమైంది. మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని, ఇతర దేశస్థుల ప్రాబల్యం పెరుగుతుంది అని గ్రహించిన అక్కడ యువత ప్రభుత్వాలకు ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు సభలు ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు...
మన అతి సంస్కృతీ ప్రచారం
ముఖ్యంగా మన దేశం నుంచి వలసలు వెళ్లిన వారు అక్కడ సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కాకుండా, మన దేశం సంస్కృతి సంప్రదాయాలను పాటించడం ఎక్కువవడం, అంతేకాకుండా వేరు వేరు రాష్ట్రాలు నుంచి వెళ్లిన వారు ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు అతిగా పాటించ డం, బహిరంగంగా భారీ ఎత్తున పండుగలు పర్వదినాలు జరపడం వల్ల ఆయా దేశాల ప్రజలు మన కల్చర్‌ని ధ్వంసం చేస్తున్నారు అనే భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ దేశంలో బాహాటంగా పెళ్లిళ్లు కూడా పెద్ద ఊరేగింపు పద్ధతిలో చేయడం జరుగుతుంది.. ఇటువంటి పద్ధతులు అక్కడ ఉండవు సరికదా.. పబ్లిక్‌కు అసౌకర్యంగా మారుతుంది. వాస్తవం చెప్పాలంటే మన కంటే డిసిప్లిన్ సొసైటీ ఆయా దేశాల్లో ఉంది.
వలస వ్యతిరేకతకు అదే కారణం
ఒక పక్క మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లాగేసుకుంటున్నారు అనే భావన, మరో వైపు మన కల్చర్‌పై దాడి చేస్తున్నారు అనే భావన పెరుగుతూ చివరికి ప్రస్తుతం వలస వ్యతిరేకత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఇక ఇటీవల కాలంలో మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దాదాపు అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల జెండాలు అక్కడ రెపరెపలాడుతున్నాయి.. ఇక్కడ నుంచి వలస వెళ్లిన వారు అక్కడ కూడా వివిధ రాజకీయ పార్టీల సభ్యులుగా మారి హడావిడి చేయడం కూడా వలస ఉద్యమానికి ఊతం ఇస్తోంది.. ఇక బతుకు తెరువు కోసం వెళ్లిన వారు, అక్కడ పౌరులుగా మారే పనిలో నిమగ్నమయ్యారు... దీంతో ఆయా దేశాల ప్రజలు యువత ఆందోళన చెందుతున్నా రు... వలస ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు..
అందుకే.. వలస వ్యతిరేక ర్యాలీ
మన దేశంలో ఉన్న మత సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలు నిర్మాణాలు, పూజ లు, రకరకాల మత క్రతువులు చేయడం ఇటీ వల కాలంలో విదేశాల్లో అధికంగా జరగటం ప్రారంభించారు.. మన కల్చర్ అక్కడ డెవలప్మెంట్ చేయడం ప్రారంభించారు.. దీనికి తోడు రెలిజియన్ టూరిజం (మత పరమైన), మ్యారేజ్ టూరిజం వంటి కొత్త కార్యక్రమాలు చేపట్టడం కూడా ఆయా దేశాల ప్రజల్లో సాం స్కృతిక పరంగా ఆందోళన కలిగిస్తోంది.. ఇక మన దేశంలో ఉన్న అలవాట్లు అక్కడ పాటించడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుంది. అనగా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో, క్లీనింగ్ వంటి విషయాల్లో, చెత్త నిర్వహణలో అలస త్వం వంటివి అక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది.. ఇలా అనేక రకమైన విషయాల్లో వలస వెళ్ళిన భారతీయుల విధి విధానాలు అక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది అని, వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారు అనే భావన పెరు గుతూ నేడు చివరికి ఏ దేశం వారు, ఆ దేశం వెళ్ళిపోండి అనే ఉద్యమం ఊపందుకుంది..
వికసిత్ భారత్ కావాలంటే..
ప్రపంచ దేశాల్లో మారుతున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకుని పాలకులు మన దేశంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేయాలి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలి... వ్యవసాయ పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పరచుకోవాలి. MSME వంటి వాటిని ప్రోత్సహించాలి.. ఎఫ్.టి.ఏ విధానం పెంచాలి. స్కిల్ డెవలప్మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. స్వదేశంలోనే ప్రజలు స్వశక్తితో బ్రతికే విధంగా ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకోవాలి... వికసిత భారత్‌గా మనదేశం భవిష్యత్తులో ఆవిర్బించాలని ఆశిద్దాం..
-ఐ.ప్రసాదరావు
63056 82733






