- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగుల్లో కొత్త ఆశలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఉద్యోగాలను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకుపోవచ్చనే

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఉద్యోగాలను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకుపోవచ్చనే ఆలో చనతో ప్రజాప్రభుత్వం జాబ్ కేలండర్‌ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో తొలి జాబ్ కేలెండర్‌ను విడుదల చేసింది. అందులో గ్రూప్–1 ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన 15 రకాల ఉద్యో గాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించిం ది. కానీ ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకో వచ్చని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం.. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు విభజించాల్సి రావడంతో ఉద్యోగ ప్రకటనలకు అంత రాయం ఏర్పడింది. ఎస్సీ వర్గీకరణను ఏప్రిల్‌లో ఆమోదించుకున్న అప్పటి నుండి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. తొలి జాబ్ కేలండర్ గడువు సైతం ముగియడంతో కొత్త జాబ్ కేలండర్ ఇస్తారా? లేక గత కేలండర్‌లో నిర్దేశించిన నోటిఫికేషన్లకు సంబంధించి తేదీలు మార్చి విడుదల చేస్తారా? అనే విషయం తెలియక నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి జాబ్ కేలండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 22 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి అనుమతులు సిద్ధంగా ఉన్నాయి. మార్చిలోగా లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి వర్గంలో నిర్ణయించింది. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు చిగురిస్తున్నాయి. ఏళ్లుగా నిరుద్యోగులు పడుతున్న బాధలు తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్చ్ లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో సర్కారు ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రకటన అభ్యర్థులకు నూతనోత్సాహాన్ని నింపింది. మార్చిలోగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఈసారి ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే కొత్తవారు సైతం కోచింగ్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
- కోనిండ్ల మోహన్
90527 11868






