హై హై ప్రతినాయకా..!

by Ravi |   (  Updated:2025-01-18 00:30:37  IST  )

సినిమా కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి.. ప్రతి నాయక గుణాలున్న నాయకుడిదే హవా. బాక్సాఫీసు.. తగ్గేదేలే

హై హై ప్రతినాయకా..!
X

సినిమా కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి.. ప్రతి నాయక గుణాలున్న నాయకుడిదే హవా. బాక్సాఫీసు.. తగ్గేదేలే. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ని ఒక కేసులో ముద్దాయి(ఫెలొని)గా అక్కడి న్యాయ వ్యవస్థ ఖరారు చేసింది. అయితే ఆయన చేపడుతున్న పదవి దృష్ట్యా నేరానికి ఏ రకమైన శిక్షా విధించడం లేదని, విడిచిపెట్టేస్తున్నామని తీర్పు చెప్పింది. అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేక అధికారాల వల్ల మిగతా మూడు నేర సంబంధిత కేసులు కొట్టి వేయవచ్చు లేదా వాయిదా పడవచ్చు కానీ ఇలా నేరస్తుడి ముద్ర పడిన తొలి అధ్యక్షుడు ఆయనే అవుతారు. ఒకందుకు అక్కడి న్యాయవ్యవస్థను మెచ్చుకోవచ్చు. అధ్యక్షుడిగా ఖరారు అయినా ఆయన కేసు వాయిదాల మీద వాయిదాలు పడలేదు. ప్రక్రియ ఆగలేదు. అందులో ఎలాంటి రాయితీ దొరకలేదు. అదే ఇక్కడ అయితేనా, పదవిలో ఉన్న నిందితుల పిల్లలు కూడా ముసలి వాళ్లు అయిపోతారు. కేసు ఎటూ తేలదు. అక్కడ ట్రంప్ శిక్ష రద్దు చేసి ఉండొచ్చు కానీ నేరం చేశావని సర్వశక్తివంతుడైన అధ్యక్షుడినే బోనులో నిలబెట్టడం బాగుంది.

డా. డి.వి.జి. శంకరరావు

మాజీ ఎంపీ, 94408 36931

Next Story