- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా అస్తిత్వంపై మీ పెత్తనమా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన దీర్ఘకాల ఉద్యమం, త్యాగాల ప్రాముఖ్యత, మరియు తాజా రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో ఆత్మగౌరవంపై చర్చ. రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ వైఖరులపై విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం, ప్రజల త్యాగాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా 2014లో భారత పార్లమెంట్ ఆమోదంతో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించింది’ అని, అమిత్ షా ఆంధ్ర విభజనను కాంగ్రెస్ ఆమోదించిన రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ తెలంగాణ ఏర్పాటుపై అసహనాన్ని, అక్కస్సును వెళ్ళగక్కారు.. మొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా విభజనను పాక్- భారత్ విభజనగా పోల్చడంతో ఒక్క తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశమే ఈ అనైతిక పోలికను అసహ్యించుకుంది. అయితే, తెలంగాణ సంపదపై గుజరాతీయులు దోపిడీ చేయడం కొత్త కాదు.. దేనికి లొంగని తెలంగాణ అస్తిత్వం, స్వాభిమానంపై పెత్తనం చెలాయించాలనే ఆలోచన, దుర్బుద్ధిని మనం 14వ శతాబ్ద ప్రారంభ దశలో నుండి నేటి వరకు చూడొచ్చు.. గుజరాతీయులకు తెలంగాణ ఈ ప్రాంత సంపదపై కన్ను తప్ప తెలంగాణపై ప్రేమ లేదని, స్వభావంలో మార్పు లేదని అర్థం చేసుకోవచ్చు. జనసంఘ్ కాలం నుంచే బీజేపీకి తెలంగాణ అంశంపై వ్యతిరేక వైఖరి కనిపించింది. 1969 ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం, తర్వాత రెండవ SRC అవసరం అంటూ ఆలస్యం చేయడం జరగలేదా? ఇక 1998లో ‘ఒక ఓటు – రెండు రాష్ట్రాలు’ అని హామీ ఇచ్చి 2000లో ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడం నిజం కాదా? మీ హమీ ప్రకారం అప్పుడే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే 1200 మంది అమరులయ్యేవారా? కాబట్టి రాష్ట్రం మన త్యాగల ఫలితం నాయకుల వ్యాఖ్యలు, పోలికలు ఎలా ఉన్నా అవి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేవు.
-కడారి రమేశ్ యాదవ్
78932 85131






